Share News

న్యాయం గెలిచింది

ABN , First Publish Date - 2023-12-01T00:03:26+05:30 IST

అధికార పార్టీ పెట్టిన అక్రమ కేసులపై న్యాయం గెలిచిందని టీడీపీ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు మం జునాథ్‌ అన్నారు.

న్యాయం గెలిచింది
విలేకరులతో మాట్లాడుతున్న మంజునాథ్‌

టీడీపీ నాయకుడు మంజునాథ్‌

మడకశిరటౌన, నవంబరు 30: అధికార పార్టీ పెట్టిన అక్రమ కేసులపై న్యాయం గెలిచిందని టీడీపీ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు మం జునాథ్‌ అన్నారు. అధికార పార్టీ ఎన్ని కుట్రలు పన్నినా అవి ముమ్మాటికి సాగవన్నా రు. ఆయన గురువారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తనపై అధికార పార్టీ నాయకులు 20 రోజుల క్రితం అక్రమ కేసులు బనాయించారన్నారు. తాను గురువారం కోర్టులో లొంగిపోగా తొ లు త జడ్జి 14 రోజులు రిమాండ్‌ విధించారని, వెంటనే బెయిల్‌ పిటీషన దాఖలు చేయగా బెయిల్‌ మంజూరు చేశారన్నారు. తాను అధికార పార్టీ నాయకులు చేస్తున్న అక్రమాలను ఎత్తి చూపుతున్నానని తనపై కక్షకట్టి అక్రమ కేసుల్లో ఇరికిస్తున్నారని ఆరోపించారు. లాంటి అక్రమ కేసులు ఎన్ని బనాయించినా తాము భయపడే ప్రసక్తే లేదని, ప్ర జలకు అండగా ఉండి వారికి న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తా మన్నారు.

Updated Date - 2023-12-01T00:03:28+05:30 IST