చిరుత సంచారంతో భయం.. భయం..
ABN , First Publish Date - 2023-12-01T00:01:26+05:30 IST
మడకశిర సమీపం కొండ ప్రాం తంలో గురువారం సాయంత్రం చిరుత సంచారంతో పట్టణ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు.
మడకశిరటౌన, నవంబరు 30: మడకశిర సమీపం కొండ ప్రాం తంలో గురువారం సాయంత్రం చిరుత సంచారంతో పట్టణ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. పట్టణ సమీపంలోని రాళ్ల మధ్యలో చిరుత సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో ప్రజలు చిరుతను ఇళ్లపై నుంచి చూసేందుకు ఆసక్తి చూపారు. సాయంత్రం వేళ కావడంతో కొం డ ప్రాంత సమీపంలోని ఇళ్ల వద్ద ప్రజలు వాకిళ్లు వేసుకున్నారు. ఈ మధ్య ప్రాంతంలో ఎప్పుడూ ఇక్కడ చిరుత సంచరించలేదని, ఈరోజు కనిపించినట్లు పట్టణంలో పలువురు చర్చించుకోవడం కనిపించింది. చిరుత ఇళ్ల మధ్యకు రాకుండా అటవీ అధికారులు చర్యలు తీసుకోవాలని పట్టణ వాసులు కోరుతున్నారు.