Share News

ఘోర రోడ్డు ప్రమాదం

ABN , Publish Date - Dec 17 , 2023 | 11:54 PM

అనంతపురం రూరల్‌ మండలం కురుగుంట గ్రామ సమీపాన చిన్నంపల్లి క్రాస్‌లో కళ్యాణదుర్గం రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఆగివున్న బండల లారీని మరో లారీ ఢీకొనడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. ఒకరు గాయపడ్డారు.

ఘోర రోడ్డు ప్రమాదం
ప్రమాదంలో నుజ్జ యిన లారీ

ఫ ఆగివున్న బండల లారీని ఢీకొట్టిన మరో లారీ

ఫ డ్రైవర్‌, ఇద్దరు కూలీల దుర్మరణం

అనంతపురం క్రైం, డిసెంబరు17: అనంతపురం రూరల్‌ మండలం కురుగుంట గ్రామ సమీపాన చిన్నంపల్లి క్రాస్‌లో కళ్యాణదుర్గం రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఆగివున్న బండల లారీని మరో లారీ ఢీకొనడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. ఒకరు గాయపడ్డారు. మృతులంతా కర్ణాటక రాష్ట్రంలోని హిరియూర్‌ ప్రాంతవాసులు. హిరియూర్‌ నుంచి శనివారం లారీలో అనంతపురం నగరానికి కోళ్ల దాణా తీసుకొచ్చారు. రాత్రికి కోళ్ల దాణాను అనలోడ్‌ చేసి డ్రైవర్‌ ప్రశాంత(23), క్లీనర్‌ సుభాష్‌ చంద్రబోష్‌, కూలీలు మహలింగ(50), నింగరాజు(21) తిరుగు ప్రయాణమయ్యారు. లారీ క్యాబినలో డ్రైవర్‌ ప్రశాంత, కూలీలు మహలింగ, నింగరాజు కూర్చున్నారు. తలనొప్పిగా ఉందని క్లీనర్‌ సుభాష్‌ చంద్రబోస్‌ క్యాబినలో డ్రైవర్‌ వెనుక ఉన్న సీటులో పడుకున్నాడు. కురుగుంట సమీపాన చిన్నంపల్లి క్రాస్‌లో అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచి బండల లోడుతో వెళ్తున్న లారీ ముందు టైర్‌ పంక్చర్‌ కావడంతో రోడ్డుకు అడ్డంగా ఆగిపోయింది. తెల్లవారుజామున కావడం, పొగమంచు ఎక్కువగా ఉండటంతో రోడ్డుకు అడ్డంగా ఆగివున్న బండల లారీని గమనించక హిరియూరు లారీ వేగంగా ఢీకొట్టింది. వాహనం ముందుభాగం నుజ్జునుజ్జయింది. తీవ్ర రక్త గాయాలపాలైన డ్రైవర్‌ ప్రశాంత, కూలీలు మహలింగ, నింగరాజు అక్కడికక్కడే మృతిచెందారు. క్లీనర్‌ సుభాష్‌ చంద్రబో్‌సకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే డయల్‌-100కు సమాచారం అందించారు. పోలీసులు.. ప్రమాద స్థలానికి చేరుకుని, పరిశీలించారు. కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అనంతపురం రూరల్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల్లో మహలింగకు భార్య, ఇద్ద రు పిల్లలు ఉన్న ట్లు తెలిసింది. మిగతా ఇద్దరు అవివాహితులని సమాచారం.

Updated Date - Dec 17 , 2023 | 11:54 PM