పాముకాటుతో రైతు మృతి
ABN , First Publish Date - 2023-12-03T00:46:25+05:30 IST
బత్తలపల్లి, డిసెంబరు 2: మండలంలోని రామంజినపల్లి గ్రామానికి చెందిన రైతు చంద్రశేఖర్‌నాయుడు (44) పాముకాటుకు గురై మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి.
బత్తలపల్లి, డిసెంబరు 2: మండలంలోని రామంజినపల్లి గ్రామానికి చెందిన రైతు చంద్రశేఖర్‌నాయుడు (44) పాముకాటుకు గురై మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. చంద్రశేఖర్‌నాయుడు తన వరి పంటను అడవి పందుల భారి నుంచి కాపాడేందుకు గాను శనివారం సాయంత్రం మ డి చుట్టూ కర్రలు పాతుండగా పాము కాటు వేసింది. గ మనించిన ఆయన అక్కడే ఉన్న భార్య సౌభాగ్యకు విష యం చెప్పి సృహతప్పి పడిపోయారు. భార్య వెంటనే బంధువుల సాయంతో చంద్రశేఖర్‌నాయుడును ద్విచక్రవాహనంలో బత్తలపల్లి అర్డీటీ ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.