ముఖ హాజరు యాప్‌ను రద్దుచేయాలి

ABN , First Publish Date - 2023-01-25T00:08:39+05:30 IST

ముఖహాజరు యాప్‌ను తక్షణమే రద్దుచేయాలని శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్‌ దిల్షాద్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు.

ముఖ హాజరు యాప్‌ను రద్దుచేయాలి

ఐసీడీఎస్‌ కార్యాలయం ఎదుట అంగనవాడీల ధర్నా

ధర్మవరం, జనవరి 24: ముఖహాజరు యాప్‌ను తక్షణమే రద్దుచేయాలని శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్‌ దిల్షాద్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. అంగనవాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు స్థానిక లక్ష్మీచెన్నకేశవపురంలో ఉన్న ఐసీడీఎస్‌ కార్యాలయం ఎదుట అంగనవాడీలు సీఐటీయూ ఆధ్వర్యంలో ఽమంగళవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రభుత్వం కేటాయించిన సెంటర్ల అద్దెలు పూర్తిగా చెల్లించాలని, కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ మెనూ చార్జీలు పెంచాలని డిమాండ్‌చేశారు. అంగనవాడీ కార్యకర్తల చేత వెట్టిచాకిరీ చేయిస్తున్నారని, అందుకు తగ్గట్టుగా వేతనాలు ఇవ్వలేదన్నారు. అలాగే కేంద్రాలకు ప్రభుత్వమే గ్యాస్‌ సరఫరా చేయాలని, 2017 నుంచి పెండింగ్‌లో ఉన్న టీఎ బిల్లులు చెల్లించాలని, సీనియారిటీ ప్రకారం గౌరవవేతనం ఇవ్వాలని, సూపర్‌వైజర్‌ పోస్టులకు వయోపరిమితి తొలగించాలన్నారు. జీఓ నెంబర్‌ 1ని రద్దుచేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల అధ్యక్షకార్యదర్శులు ఎల్‌ ఆదినారాయణ, అయూబ్‌ఖాన, అంగనవాడీలు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-25T00:08:46+05:30 IST