సంప్రదాయ కళల్లో రాణింపు అభినందనీయం
ABN , Publish Date - Dec 26 , 2023 | 12:04 AM
చిన్నారులు సంప్రదాయ కళల్లో రాణిస్తుండడం అభినం దనీయం అని లయన్స క్లబ్ ఇంటర్నేషనల్ సంస్థ జిల్లా ఛైర్మన లయన కంబదూరి షేక్ నబిరసూల్ పేర్కొన్నారు
అనంతపురం కల్చరల్ : చిన్నారులు సంప్రదాయ కళల్లో రాణిస్తుండడం అభినం దనీయం అని లయన్స క్లబ్ ఇంటర్నేషనల్ సంస్థ జిల్లా ఛైర్మన లయన కంబదూరి షేక్ నబిరసూల్ పేర్కొన్నారు. సోమనాథ్ నగర్‌లోని ఓమ్ సంగీత నృత్య కోలాట శిక్షణాలయం ఆధ్వర్యంలో నాట్య శిక్షణ పొంది రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ప్రదర్శనలిచ్చి ఉత్తమ గుర్తింపు పొందిన పలువురు చిన్నారులను ఆ కార్యాలయంలో సోమవారం అభినందించారు. సభకు కంబదూరి షేక్ నబిరసూల్ ఆ చిన్నారు లందరికీ ప్రశంసాపత్రాలు అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం పరిరక్షణ సంస్థ జిల్లా అధ్యక్షుడు హొన్నూరప్ప, నాగరాజరావు, కనంపల్లి ఉమారాణి, నృత్య శిక్షణాలయం అధ్యక్షురాలు దేవరకొండ కౌసల్య పాల్గొన్నారు.