స్పాట్‌కి సర్వం సిద్ధం

ABN , First Publish Date - 2023-04-17T00:24:21+05:30 IST

పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనానికి జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 19వ తేదీ నుంచి 26వ తేదీ వరకూ మూల్యాంకనం చేసేలా పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది.

స్పాట్‌కి సర్వం సిద్ధం
మూల్యాంకనానికి టేబుళ్లు దించుతున్న సిబ్బంది

19 నుంచి 26 వరకూ ‘పది’ మూల్యాంకనం

ఐటీ సెల్‌లో కొరవడిన ఐక్యత.. విద్యాశాఖలో డేటా గోల

కిందిస్థాయి సిబ్బందికి డీఈఓ అక్షింతలు

క్షేత్రస్థాయి నుంచి డేటా సేకరణ

తర్వాత స్పాట్‌కి స్టాఫ్‌ నియామకం

అనంతపురం విద్య, ఏప్రిల్‌ 16: పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనానికి జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 19వ తేదీ నుంచి 26వ తేదీ వరకూ మూల్యాంకనం చేసేలా పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. ఇప్పటికే ఇతర జిల్లాల నుంచి 10వ తరగతి జవాబుపత్రాలు జిల్లాకు చేరుతున్నాయి. జిల్లా కేంద్రంలోని కేఎ్‌సఆర్‌హైస్కూల్‌లో స్పాట్‌ క్యాంపు నిర్వహించనున్నారు. స్పాట్‌కు స్టాఫ్‌ను నియమించాలంటే జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఐటీ సెల్‌లో ఉండాల్సిన టీచర్ల వివరాలు(డేటా) ఇటీవల అందుబాటులో లేవు. ఐటీ సెల్‌లోని కోల్డ్‌ వార్‌ నేపథ్యంలో స్పాట్‌కు అవసరమైన డేటాను డీఈఓ సంబంధిత సిబ్బందిని కోరగా..ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ వచ్చారు. దీంతో డీఈఓ కొందరు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఖరికి మళ్లీ క్షేత్రస్థాయి నుంచి డేటాను సేకరించారు. స్పాట్‌కు అవసరమైన చీఫ్‌ ఎగ్జామినర్లు (సీఈ), అసిస్టెంట్‌ ఎగ్జామినర్లు (ఏఈ), స్పెషల్‌ అసిస్టెంట్లతో పాటు ఇతర స్టాఫ్‌ను డీఈఓ సాయిరాం, ఏసీ గోవింద్‌ నాయక్‌ నియ మించారు.

19 నుంచి మూల్యాంకనం..

ఈ ఏడాది 10వ తరగతి మూల్యాంకనం ఈనెల 19వ తేదీ నుంచి 26వ తేదీ వరకూ నిర్వహించేలా ఈనెల 11న విద్యాశాఖ కమిషనర్‌ ఆదేశాలు జారీచేశారు. అసిస్టెంట్‌ ఎగ్జామినర్లు 40 జవాబుపత్రాలను మూల్యాంకనం చేయాల్సి ఉంటుంది. ఏఈ మూల్యాంకనం చేసిన జవాబుపత్రాల్లోని మార్కులను స్పెషల్‌ అసిస్టెంట్లు కౌంట్‌ చేస్తారు. విద్యార్థులు అదనంగా(ఎక్సెస్‌) జవాబులు రాశారా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. రాసి ఉంటే వాటిని మూల్యాంకనం చేశారా అన్నది కూడా చెక్‌ చేయాలి. అదనంగా రాసిన సమాధానాలకు ఎక్కువ మార్కులు వచ్చి ఉంటే.. వాటినే పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. చీఫ్‌ ఎగ్జామినర్లు ఏఈలు దిద్దిన పేపర్లను కనీసం 20 చెక్‌ చేయాల్సి ఉండగా, సీఈ 60 పేపర్లు చెక్‌ చేయాల్సిఉంటుంది. అసిస్టెంట్‌ క్యాంపు ఆఫీసర్లు కనీసం ఒక్కో ఏఈలు దిద్దిన రెండు పేపర్లను వెరిఫై చేయాల్సి ఉంటుంది. డిప్యూటీ క్యాంపు ఆఫీసర్‌ నిత్యం కనీసం 45 పేపర్లను, క్యాంపు ఆఫీసర్‌ 20 పేపర్లను వెరిఫై చేయాల్సిఉంటుంది. ఈ మేరకు సీఎస్‌ఈ ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 26వ తేదీ వరకూ స్పాట్‌ నిర్వహించాల్సి ఉంటుంది.

కొరవడిన ఐక్యత

జిల్లా విద్యాశాఖలోని ఐటీ సెల్‌లో ఐక్యత లోపించింది. స్పాట్‌కు డ్యూటీ వేసే విషయం టీచర్స్‌ డేటా ఐటీ సెల్‌ నుంచి పూర్తిస్థాయిలో అందలేదు. ఏఎ్‌సఓ, ఏపీఓలు, ఇతర స్టాఫ్‌ మధ్య సమన్వయం లేకపోవడంతో ఈ ఘటన కొత్త సమస్యకు దారితీసింది. గత కొంతకాలంగా ఐటీ సెల్‌లో కో-ఆర్డినేషన లేకపోవడంతో ఈ సమస్య తలెత్తింది. డీఈఓ అడిగిన సమాచారం లేకపోవడంతో ఆయన ఏఎ్‌సఓ, ఇతర ఏపీఓలపై అసహనం వ్యక్తం చేశారు. పరీక్షల విభాగం అధికారులు సైతం డేటా విషయంలో ముందుచూపు లేకపోవడంతో ఆ విభాగం అధికారులపై కూడా డీఈఓ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. గత మూడు రోజులుగా పరీక్షల క్యాంపులోనూ, డీఈఓ ఆఫీ్‌సలోనూ ఇది చర్చనీయాంశంగా మారింది. ఆఖరికి మళ్లీ క్షేత్రస్థాయి నుంచి టీచర్స్‌ డేటాను సేకరించారు. దీంతో స్పాట్‌ కోసం స్టాఫ్‌ను నియమించారు. ఏఈ, సీఈలుగా తెలుగు సబ్జెక్టుకు 139 మందిని, హిందీకి 112, ఇంగ్లి్‌షకి 248 మంది, గణితంకి 144 మంది, సైన్స(ఫిజిక్స్‌)కి 144మంది, సైన్స (బయాలజీ)కి 144మంది, సోషియల్‌కి 96మంది, సంస్కృతంకి 24 మంది, ఒకేషనల్‌ ఆరుగురిని, స్పెషల్‌ అసిస్టెంట్లుగా 211 మందిని నియమించారు.

19న రిపోర్ట్‌ చేసుకోవాలి: సాయిరాం, డీఈఓ

ఈనెల 19 నుంచి టెన్త స్పాట్‌ వాల్యుయేషన నిర్వహిస్తున్నాం. అన్ని ఏర్పాట్లు చేశాం. ఏసీఓలు, చీఫ్‌ ఎగ్జామినర్లు, అసిస్టెంట్‌ ఎగ్జామినర్లు ఇతర సిబ్బందిని నియమించాం. పీహెచ, ఎక్కువ వయస్సు ఉన్నవారిని, అంధులు, నాడు-నేడు పనులున్న హెచఎంలకు మినహాయించాం. వేసవి నేపథ్యంలో ఎగ్జామినర్లకు గాలి, వెలుతురు చక్కగా ఉండేలా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాం. ఈ నెల 19న ఉదయమే స్టాఫ్‌ రిపోర్ట్‌ చేసుకోవాలి.

Updated Date - 2023-04-17T00:24:21+05:30 IST