ప్రతి విద్యార్థి శాస్త్రవేత్త కావాలి

ABN , First Publish Date - 2023-03-26T00:33:47+05:30 IST

ప్రతి విద్యార్థి శాస్త్రవేత్త కావాలని ప్రముఖ శాస్త్రవేత్త, ఇండియన ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స ఎడ్యుకేషన అండ్‌ రీసెర్చ్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సౌమిత్ర బెనార్జీ పేర్కొన్నారు.

ప్రతి విద్యార్థి శాస్త్రవేత్త కావాలి

ప్రముఖ శాస్త్రవేత్త సౌమిత్ర బెనర్జీ

గార్లదిన్నె, మార్చి 25: ప్రతి విద్యార్థి శాస్త్రవేత్త కావాలని ప్రముఖ శాస్త్రవేత్త, ఇండియన ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స ఎడ్యుకేషన అండ్‌ రీసెర్చ్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సౌమిత్ర బెనార్జీ పేర్కొన్నారు. శనివారం స్థానిక ఆదర్శ పాఠశాల, జూనియర్‌ కళశాలలో శాస్ర్తీయ దృక్పథం అంశంపై సెమినార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు సైన్స పట్ల అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. సైన్స పై ఆఽధారపడి పలు విషయాలను విశ్లేషించుకోవాలన్నారు. విద్యార్థులకు పీసా టవర్‌ ప్రయోగాన్ని చేసి చూపించారు. ముఖ్యంగా విద్యార్థులందరు ప్రశ్నించే స్వభావాన్ని పొందించకోవాలన్నారు. అనంతరం ఉపాధ్యాయ బృంధం ప్రొఫెసర్‌ సౌమిత్ర బెనార్జీని సత్కరించారు. కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జ్‌ ప్రిన్సిపాల్‌ చంద్రకళ, ఉపాధ్యాయులు అబ్దుల్‌ అలీమ్‌, హిరలాల్‌, శివయ్య, వెంకటేసు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-26T00:33:47+05:30 IST