5 నుంచి ఎర్రితాత ఆరాధనోత్సవాలు

ABN , First Publish Date - 2023-06-02T23:35:29+05:30 IST

అవదూత ఎర్రితాత ఆరాధనోత్సవాలను మండల కేంద్రంలోని శాంతి ధామంలో ఈ నెల 5 నుంచి 7 వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ సేవా సంఘం, గ్రామస్థులు తెలిపారు.

  5 నుంచి ఎర్రితాత ఆరాధనోత్సవాలు

బెళుగుప్ప, జూన 2: అవదూత ఎర్రితాత ఆరాధనోత్సవాలను మండల కేంద్రంలోని శాంతి ధామంలో ఈ నెల 5 నుంచి 7 వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ సేవా సంఘం, గ్రామస్థులు తెలిపారు. ఈ నెల 5న నంది పూజ, గణపతి, గంగ పూజలు, నంది వాహన సేవ, 7 న శ్రీవారి ఉత్సవం, పల్లకి సేవ, శేష, అలంకరణలో భక్తులకు దర్శనం. 8న ఉట్ల పరుష, ఉదయం అభిషేకాలు, అర్చనలు, ఛత్రప్రభ అలంకరణతో దర్శనం. సాయంత్రం భజనలు కోలాటాలతో ఉత్సవాలు ముగిస్తారని తెలిపారు.

Updated Date - 2023-06-02T23:35:29+05:30 IST