ఉత్సాహంగా రాతిదూలం లాగుడు పోటీలు

ABN , First Publish Date - 2023-03-26T00:11:20+05:30 IST

పట్టణంలోని కృష్ణాపురం జీరోరోడ్డులో ఉన్న గంగమ్మ ఆలయంలో జరుగుతున్న ఉగాది వేడుకల్లో భాగంగా శనివారం రాతిదూలం లాగుడు పోటీలు జరిగాయి.

ఉత్సాహంగా రాతిదూలం లాగుడు పోటీలు

తాడిపత్రిటౌన, మార్చి 25: పట్టణంలోని కృష్ణాపురం జీరోరోడ్డులో ఉన్న గంగమ్మ ఆలయంలో జరుగుతున్న ఉగాది వేడుకల్లో భాగంగా శనివారం రాతిదూలం లాగుడు పోటీలు జరిగాయి. యాదవ సంఘం సభ్యులతోపాటు నిర్వాహకులైన ఆకుల చిన్ననాగిరెడ్డి, ఆకుల వెంకటనాగిరెడ్డి ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు. పోటీల్లో మొత్తం 10 జతల వృషభాలు పాల్గొన్నాయి. ఈ పోటీల్లో కర్నూలు జిల్లా డోన మండలంకు చెందిన పీఆర్‌పల్లి వృషభాలు 2622 అడుగులు లాగి మొదటి బహుమతి రూ.60 వేలు గెలుచుకున్నాయి. రెండో బహుమతి రూ.50 వేలును పీఆర్‌పల్లికి చెందిన శ్రీరాములుయాదవ్‌, చిట్టిబోయిన కీర్తియాదవ్‌కు చెందిన వృషభాలు 2407అడుగులు లాగి గెలుచుకున్నాయి. గార్లదిన్నెకు చెందిన రామాం జనే యులు వృషభాలు 1815 అడుగులు లాగి మూడో బహుమతి రూ.40 వేలు దక్కించుకున్నాయి. రంగాపురం గ్రామానికి చెందిన మేకల సుదర్శన వృష భాలు 1544అడుగులు లాగి నాల్గో స్థానంలో నిలిచి రూ.30వేలు దక్కిం చుకున్నాయి. తాడిపత్రి మండలంలోని తేరన్నపల్లి గ్రామానికి చెందిన కూర పాటి భాస్కర్‌నాయుడు వృషభాలు 1516అడుగులు లాగి ఐదవ బహు మతి కింద రూ.20వేలు సాధించాయి. యాడికి మండలం కుం దనకోటకు చెందిన చెన్నప్ప వృషభాలు 1465అడుగులు లాగి ఆరవ బహుమతి రూ.10 వేలు దక్కించుకున్నాయి. పోటీల్లో పాల్గొన్న మిగిలిన వృషభాల యజ మానులకు కన్సోలేషన బహుమతుల కింద రూ.5వేల బహుమతులను నిర్వా హకులు అందించారు.

Updated Date - 2023-03-26T00:11:20+05:30 IST