పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం: కలెక్టర్‌

ABN , First Publish Date - 2023-03-26T00:06:19+05:30 IST

జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందించాలని కలెక్టర్‌ బసంతకుమార్‌ అధికారులను ఆదేశించారు.

పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం: కలెక్టర్‌

పుట్టపర్తి, మార్చి 25: జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందించాలని కలెక్టర్‌ బసంతకుమార్‌ అధికారులను ఆదేశించారు. ఈమేరకు శనివారం కలెక్టరేట్‌ కార్యాలయంలో పరిశ్రమలు-ఎగుమతి ప్రోత్సాహక కమిటీతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో పీఎంఈజీపీ కింద పరిశ్రమల స్థాపన కోసం నిరుద్యోగ యువతకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇండసీ్ట్రయల్‌ డెవల్‌పమెంట్‌ పాలసీకింద 2020-23కు సంబంధించి 14 మంది లబ్దిదారులకు పెట్టుబడి రాయితీ అందించే విషయమై ప్రతిపాదనలకు కమిటీ అమోదం తెలిపింది. ఈ సమావేశంలో పరిశ్రమల అధికారి చాంద్‌బాషా, ఏపీ ఎన్విరానమెంటల్‌ అధికారి శంకర్రావు, ఏపీఎస్పీడీసీఎల్‌ డీఈఈ మోసెస్‌, ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ మురళీమోహన తదితరులు పాల్గొన్నారు.

‘వయోవృద్ధుల పరిరక్షణే ధ్యేయం’

వయోవృద్ధుల పరిరక్షణ, హక్కులను కల్పించడంలో ప్రభుత్వం పూర్తీగా అండగా ఉంటుందని కలెక్టర్‌ బసంతకుమార్‌ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్‌లో విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి సమావేశం కలెక్టర్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఏడీ అబ్దుల్‌రసూల్‌, జిల్లాపరిశ్రమలశాఖ అధికారి చాంద్‌బాషా, వికలాంగ సంక్షేమశాఖ పరివేక్షకుడు రమణ, సాల్మనరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-26T00:06:19+05:30 IST