హైవేలపై అంబలెన్సులతో తక్షణ వైద్యసేవలు

ABN , First Publish Date - 2023-02-02T00:07:29+05:30 IST

జాతీయ రహదారులపై ప్రమాదాలు జరిగితే తక్షణమే అంబులెన్సుల ద్వారా వైద్యసేవలందించి సమీప ఆసుపత్రులకు తరలిస్తామని ఎనహెచఏఐ ప్రాజెక్టు డైరెక్టర్‌ జీవనలాల్‌ మీనా పేర్కొన్నారు.

హైవేలపై అంబలెన్సులతో తక్షణ వైద్యసేవలు

ప్రమాదం జరిగితే వెంటనే 1033కి కాల్‌ చేయండి

ఎనహెచఏఐ పీడీ జీవనలాల్‌ మీనా

అనంతపురం సిటీ, ఫిబ్రవరి 1: జాతీయ రహదారులపై ప్రమాదాలు జరిగితే తక్షణమే అంబులెన్సుల ద్వారా వైద్యసేవలందించి సమీప ఆసుపత్రులకు తరలిస్తామని ఎనహెచఏఐ ప్రాజెక్టు డైరెక్టర్‌ జీవనలాల్‌ మీనా పేర్కొన్నారు. బుధవారం ఆయన స్థానిక రుద్రంపేట సమీపంలో 9 అంబులెన్సు వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రాయలసీమ పరిధిలోని అనంతపురం, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి జిల్లాల పరిధిలోని జాతీయ రహదారులకు సంబందించి 9 అంబులెన్సులను మంజూరు చేసిందన్నారు. ఈ వాహనాలను జిల్లాలోని హాలహర్వి, జల్లిపల్లి, వడ్డుపల్లి, ధర్మపురం, శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలోని బత్తలపల్లి, యర్రదొడ్డి, చోళ సముద్రం, హైదరాబాద్‌, బెంగళూరు హైవేలోని టోల్‌ప్లాజాల వద్ద ఉంచుతామన్నారు. నిత్యం 24 గంటలు అంబులెన్సు సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. జాతీయ రహదారులపై ప్రమాదాలు జరిగితే తక్షణమే 1033కి కాల్‌ చేస్తే తక్షణమే అంబులెన్సు సేవలు అందుతాయన్నారు. వీటితో పాటు జాతీయ రహదారులలో ఎక్కడా సమస్యలు తలెత్తకుండా నిత్యం రూట్‌ పెట్రోలింగ్‌ వాహనాలు జాతీయ రహదారిని పర్యవేక్షిస్తాయన్నారు. కార్యక్రమంలో ఆశాఖ టీంలీడర్‌ సుబ్రహ్మణ్యం, అసిస్టెంట్‌ మేనేజర్లు నాగ హృషికేష్‌, శ్రావణ్‌కుమార్‌, రఘునాథ్‌, అంబులెన్సు ఏజెన్సీ ఇనచార్జి మోహన పాల్గొన్నారు.

Updated Date - 2023-02-02T00:07:31+05:30 IST