మౌలిక సదుపాయాలతో విద్యాప్రమాణాలు పెరగవు
ABN , Publish Date - Dec 17 , 2023 | 12:07 AM
విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పనతో విద్యాప్రమాణాలు పెరగవని, నాణ్యమైన విద్య అందించడంతోనే అది సాధ్యమవుతుందని కళాశాల విద్యాశాఖ కమిషనర్ పోలా భాస్కర్ అన్నారు.
నాణ్యమైన విద్యనందిస్తామన్న హామీ ఇవ్వాలి
కళాశాల విద్యాశాఖ కమిషనర్ పోలా భాస్కర్
ఆర్ట్స్ కళాశాలలో ఘనంగా అకడమిక్ ఫెస్ట్
అనంతపురం సెంట్రల్, డిసెంబరు 16: విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పనతో విద్యాప్రమాణాలు పెరగవని, నాణ్యమైన విద్య అందించడంతోనే అది సాధ్యమవుతుందని కళాశాల విద్యాశాఖ కమిషనర్ పోలా భాస్కర్ అన్నారు. శనివారం నగరంలోని ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ కళాశాలల అడకమిక్ ఫెస్ట్-2023ను నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పోలా భాస్కర్, జేఎనటీయూ వీసీ రంగజనార్ధన, కాలేజియేట్ కమిషనర్ అకడమిక్ గైడెన్స ఆఫీసర్ తులసి, సైకాలజిస్ట్ వీరేందర్ హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలనచేసి ఫెస్ట్‌ను ప్రారంభించారు. పోలా భాస్కర్ మాట్లాడుతూ తరగతి పాఠాల ద్వారా జ్ఞానం, ప్రతిభానైపుణ్యాలు పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. వీటితోపాటు సోషల్ ఎమోషనల్ లర్నింగ్(సామాజిక భావోద్వేగ అభ్యాసం) కీలకమన్నారు. నేటియుతలో సోషల్ ఎమోషనల్ కరువైందన్నారు. ఈ అంశాన్ని సంతులనం చేసుకున్నవారి జీవితం బంగారు బాటవుతుందన్నారు. నాణ్యమైన విద్యనందిస్తామన్న హామీ విద్యార్థులకు ఇవ్వాలని అధ్యాపకులకు సూచించారు. మేధస్సు పరంగా అభివృద్ధి సాధించినా ఆలోచనలు వాస్తవ రూపందాల్చడంలేదని, నేటికీ అభివృద్ధి చెందుతున్న దేశంగానే భారతను చెప్పుకుంటున్నామని జేఎనటీయూ వీసీ రంగజనార్ధన ఆవేదన వ్యక్తంచేశారు.
ఓరాల్ చాంపియనగా రాజమండ్రి కళాశాల...
రాష్ట్ర వ్యాప్తంగా 18 అంశాల్లో ఉత్తమ ప్రగతి సాధించిన కళాశాలలకు అవార్డులను ప్రదానం చేశారు. ఇందులో రాజమండ్రి కళాశాల ఓరాల్ చాంపియనగా నిలించింది. అలాగే ప్రగతి అంశాల్లో కృషిచేసిన అధ్యాపకులకు అవార్డులను అందజేశారు. దాదాపు 150 మందికి పైగా ఉత్తమ అవార్డులను అందజేసి అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ అంశాల్లో ఉత్తమ ప్రగతి సాధించిన కళాశాలల్లో ఆర్ట్స్ కళాశాల, కేఎ్‌సఎన ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలకు ఉత్తమ అవార్డులు దక్కాయి. కళాశాల విద్యాశాఖ కమిషనర్ పోలా భాస్కర్, జేఎనటీయూ వీసీ రంగజనార్ధన అవార్డులను ప్రదానం చేశారు. ఇందులో భాగంగా ప్లేస్‌మెంట్స్ కోఆర్డినేటర్‌గా వైస్ ప్రిన్సిపాల్ శశాంక మౌళి, ఎనఎ్‌సఎ్‌స ఆఫీసర్‌గా విష్ణుప్రియ, ఎనఎ్‌సఎ్‌స వలంటీర్‌గా దీపక్ రెడ్డి, క్రీడాకారిణిగా గంగోత్రి, స్వాతంత్య్ర వేడుకల భాగస్వాములుగా ప్రణీత, లోకేష్, సంతోష్ నాయక్, దీపక్‌రెడ్డి, అజయ్, తుకారామ్ నాయక్, మనోజ్ ఉత్తమ అవార్డులను అందుకున్నారు. ఆర్ట్స్ కళాశాలకు కీడ్రలు, న్యాక్ ఏ గ్రేడ్, ప్లేస్‌మెంట్స్, ఎనఎ్‌సఎ్‌స అవార్డులు దక్కగా, కేఎ్‌సఎన ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు న్యాక్ ఏ గ్రేడ్, అత్యధిక ప్రవేశాలు అంశాల్లో ఉత్తమ అవార్డులు లభించాయి. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ శశాంకమౌళి, విద్యాశాఖ అధికారులు తులసి, ఆర్జేడి నాగలింగారెడ్డి, ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు పాల్గొన్నారు. ప్రజ్ఞ వేడుకలను పురష్కరించుకుని నిర్వహించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.