జగన పాలనలో రాష్ట్రం అధోగతి
ABN , First Publish Date - 2023-11-30T23:57:11+05:30 IST
జగన పాలనలో రాష్ట్రం అధోగతి పాలయిందని, ఇప్పుడు రాషా్ట్రభివృద్ధి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి పేర్కొన్నారు.
టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల
మడకశిర రూరల్, నవంబరు 30: జగన పాలనలో రాష్ట్రం అధోగతి పాలయిందని, ఇప్పుడు రాషా్ట్రభివృద్ధి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి పేర్కొన్నారు. ఆయన గురువారం మండలలోని సీ కోడిగేపల్లి పంచాయతీ నల్లనాయణపల్లిలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి టీడీపీ మినీ మేనిఫెస్టో గురించి వివరించారు. ఈ సందర్భంగా గుండుమల మాట్లాడుతూ జగన పాలనలో రాష్ట్రం అధోగతి పాలయిందన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యాదర్శి శ్రీనివాసమూర్తి, మండల కన్వీనర్ లక్ష్మీనారాయన, క్లష్టర్ ఇనచార్జీలు నాగరాజు రవీంద్రారెడ్డి, మల్లికార్జున, గోపాలప్ప స్థానిక నాయకులు పాల్గొన్నారు.