Share News

ఉద్యోగుల బకాయిలను విడుదల చేయాలి

ABN , Publish Date - Dec 28 , 2023 | 12:15 AM

ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆర్థిక బకాయలు విడుదల కోసం రాష్ట్ర శాఖ పిలుపుమేరకు యూటీఎఫ్‌ డివిజన శాఖ ఆధ్వర్యంలో బుధవారం యూటీఎఫ్‌ నాయకులు ఆందోళన చేపట్టారు.

ఉద్యోగుల బకాయిలను విడుదల చేయాలి
ఆందోళన చేస్తున్న యూటీఎఫ్‌ నాయకులు, ఉపాధ్యాయులు

యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి సుధాకర్‌

పెనుకొండ, డిసెంబరు 27: ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆర్థిక బకాయలు విడుదల కోసం రాష్ట్ర శాఖ పిలుపుమేరకు యూటీఎఫ్‌ డివిజన శాఖ ఆధ్వర్యంలో బుధవారం యూటీఎఫ్‌ నాయకులు ఆందోళన చేపట్టారు. యూటీఎఫ్‌ స్థానిక కార్యాలయం ఎదుట శుక్రవారం యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి సుధాకర్‌ ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధ్యాయులు ఆందోళన చేప ట్టారు. ఈ సందర్భంగా సుధాకర్‌ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు దాదాపు రూ.18వేల కోట్లు ఆర్థిక బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. యేడాదిన్నరగా ఉద్యోగ, ఉపాధ్యాయుల పీఎఫ్‌, డీఏ, మెడికల్‌ రీఎంబర్స్‌మెంట్‌ మొదలగు వాటికి సంబంధించి బకాయిలు వి డుదల కాలేదన్నారు. దీంతో ఎన్నెన్నో అవసరాల కోసం ఉద్యోగ, ఉపాధ్యా యులు దాచుకున్న డబ్బును అవసరానికి పొందలేని దుస్థితి రాష్ట్రంలో ఏర్పడిందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచి తక్షణం స్పందించి ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక బకాయిలు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. సమస్య పరిష్కారం కాని పక్షంలో జనవరి 3న జిల్లాకేంద్రంలో 12గంటల ధర్నా, 9, 10 తేదీల్లో విజయవాడలో 36గంటల ధర్నా నిర్వహి స్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి నరేష్‌, సీనియర్‌ నాయకులు నారాయణస్వామి, జిల్లా మహిళా కన్వీనర్‌ హసీనాబేగం, నాయకులు కృష్ణానాయక్‌, నరేష్‌, ఉపేంద్ర, గంగాధర్‌, మారుతి, రవీంద్రనాథ్‌, రామాంజనేయులు, నరసింహులు, దినేష్‌, గోవిందప్ప, రాధామణి, వెంకటేశ, ప్రభాకర్‌, నరేష్‌, గోవిందు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 28 , 2023 | 12:15 AM