ఫైరింగ్ స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ
ABN , First Publish Date - 2023-12-11T00:19:20+05:30 IST
మండలంలోని చెండ్రాయునిపల్లిలో ఫైరిం గ్ రేంజి స్థలాన్ని పుట్టపర్తి డీఎస్పీ వాసుదేవన ఆదివరం పరిశీలించారు.
బుక్కపట్నం, డిసెంబరు 10: మండలంలోని చెండ్రాయునిపల్లిలో ఫైరిం గ్ రేంజి స్థలాన్ని పుట్టపర్తి డీఎస్పీ వాసుదేవన ఆదివరం పరిశీలించారు. నూ తనంగా సత్యసాయి జిల్లా ఏర్పాడిన తరువాత జిల్లాకు 15 కిలోమీటర్ల దూ రంలో ఈస్థలాన్ని పోలీస్ ఫైరింగ్‌కు ప్రభుత్వం కేటాయించింది. ఆ స్థలంలో అవసరమైన మౌలిక సదుపాలు ఎలా చేపట్టాలని కొత్తచెరువు రూరల్ సీఐ రాగిరి రామయ్య, ఎస్‌ఐ నరసింహుడులతో కలిసి చర్చించి, పరిశీలించారు. అనంతరం బుక్కపట్నం పోలీస్ స్టేషనకు వచ్చి, స్టేషన పక్కనున్న పాత సబ్ రిజిసా్ట్రర్ కార్యాలయాన్ని పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషనలో రికార్డులు పరిశీలించారు. శాంతి భద్రతలపై సీఐ, ఎస్‌ఐలతో చర్చించి, సూచనలు, సలహాలు అందించారు. క్రైమ్ రేట్ తగ్గించడం, ప్రజలతో స్నేహభావంగా మె లగడంలో కృషిచేసిన ఎస్‌ఐ నరసింహుడును డీఎస్పీ, సీఐ అభినందించి రివార్డు ప్రకటించారు.