Share News

చస్తున్నా పట్టించుకోరా..?ఫ

ABN , Publish Date - Dec 17 , 2023 | 11:52 PM

గోతుల రోడ్లు, రహదారికిరువైపులా కంపచెట్లు.. ప్రమాదాల్లో ప్రజలు చస్తున్నా పట్టించుకోరా అంటూ జడ్పీటీసీ సభ్యులు, జడ్పీ చైర్‌పర్సన ఆర్‌ అండ్‌బీ అధికారులపై మండిపడ్డారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే, బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించే అధికారులు అక్కరలేదని, జిల్లా నుంచి వెళ్లిపోవచ్చు అంటూ జడ్పీ చైర్‌పర్సన బోయ గిరిజమ్మ మండిపడ్డారు

చస్తున్నా పట్టించుకోరా..?ఫ
అధికారులపై మండిపడుతున్న కంబదూరు, శెట్టూరు జడ్పీటీసీలు

చస్తున్నా పట్టించుకోరా..?ఫ

అధ్వాన రహదారుల్లో

తరచూ ప్రమాదాలే..

ఫ ఆర్‌అండ్‌బీ అధికారులపై

చైర్‌పర్సన, జడ్పీటీసీల మండిపాటు

ఫ జడ్పీ స్టాండింగ్‌ కమిటీ

సమావేశానికి సీఈఓ గైర్హాజరు..

మూడు కమిటీలకూ ఏఓనే దిక్కు

ఫ రెండు గంటల్లోనే ముగింపు.. అనంతపురం విద్య, డిసెంబరు 17: గోతుల రోడ్లు, రహదారికిరువైపులా కంపచెట్లు.. ప్రమాదాల్లో ప్రజలు చస్తున్నా పట్టించుకోరా అంటూ జడ్పీటీసీ సభ్యులు, జడ్పీ చైర్‌పర్సన ఆర్‌ అండ్‌బీ అధికారులపై మండిపడ్డారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే, బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించే అధికారులు అక్కరలేదని, జిల్లా నుంచి వెళ్లిపోవచ్చు అంటూ జడ్పీ చైర్‌పర్సన బోయ గిరిజమ్మ మండిపడ్డారు. ఆదివారం జడ్పీలో ఏడు స్టాండింగ్‌ కమిటీ సమావేశాలు నిర్వహించారు. జడ్పీ ప్రధాన సమావేశ మందిరంలో 1,72,4 సమావేశాలు, జడ్పీ అదనపు సమావేశ మందిరంలో 3,5,6 సమావేశాలు నిర్వహించారు. నిర్ణయించిన సమయం కంటే...గంటన్నర ఆలస్యంగా ప్రారంభించారు.

ఫ జడ్పీ చైర్మపర్సన గిరిజమ్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో లేపాక్షి జడ్పీటీసీ మాట్లాడుతూ.. ఇళ్ల పట్టాలు తీసుకున్న అనేమంది లబ్ధిదారులు, 3 ఏళ్ల తర్వాత అమ్ముకోవచ్చన్న ధోరణితో చాలామంది ఇళ్లు కట్టుకోవడం లేదని, వేల సంఖ్యలో ఇలా పెండింగ్‌లో ఉన్నాయని, వాటికి పరిష్కారం చూపాలని హౌసింగ్‌ అధికారులను కోరారు. జడ్పీ చైర్మపర్సన గిరిజమ్మ మాట్లాడుతూ..ముందు లబ్ధిదారుల్లో ఇళ్ల నిర్మాణంపై చైతన్యం తేవాలన్నారు. జిల్లావ్యాప్తంగా పట్టాలు పొంది, ఇళ్లు నిర్మించని వాటి వివరాలు స్పెషర్‌ డ్రైవ్‌ నిర్వహించి అందజేయాలన్నారు.

ఫ ఆర్‌అండ్‌బీ శాఖ సమీక్షలో రోడ్లకిరువైపులా కంప సరిగ్గా తొలగించడం లేదని కంబదూరు, లేపాక్షి జడ్పీటీసీలు సభ దృష్టికి తీసుకొచ్చారు. కళ్యాణదుర్గం- కంబదూరు రహదారికి ఆర్‌అండ్‌బీ అధికారులు వస్తే... అక్కడి సమస్యలు అర్థమవుతాయన్నారు. గోతు ల రహదారులతో తరచూ ప్రమాదాలు జరుగు తున్నా యని, ప్రజలు తిరగబడే రోజులు రానీయొద్దం టూ ఆవేదన వ్యక్తం చేశారు. శెట్టూరు జడ్పీటీసీ మాట్లాడుతూ.. కేవలం కొమ్మలు నరకడమే జంగిల్‌ క్లియర్‌ చేయడమా అంటూ ప్రశ్నించారు. ఒక్క రోజులో జేసీబీతో సుమారు 50 నుంచి 60 కిలోమీటర్ల కంప ఎలా తొలగిస్తారంటూ ప్రశ్నించారు. కంబదూరు, శెట్టూరు జడ్పీటీసీలు ఇద్దరూ మాట్లాడుతూ ఇటీవలే రహ దారులపై గుంతల కారణంగా ఓ పాప చనిపోయిందని, ఆర్‌అండ్‌బీ రోడ్ల నిర్వహణ జరిగా లేదంటూ, తాము సభల్లో చెప్పడం... వాళ్లు విని వెళ్లడం మినహా ఎలాంటి చర్యలు లేవని ఆశాఖ ఈఈలు, డీఈపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఫ జడ్పీ చైర్‌పర్సన బోయ గిరిజమ్మ కలుగజేసుకుని జడ్పీటీసీల ప్రశ్నలకు సక్రమంగా సమాధానం చెప్పని డీఈపై మరింత మండిపడ్డారు. ఎప్పటిలోగా ఈ సమస్యలను ప్రశ్నిస్తారని ప్రశ్నించగా, 10 రోజుల్లో పరిష్కరిస్తాం అంటూ ఆర్‌అండ్‌బీ డీఈ సమాధానమిచ్చారు. అధికారులు జడ్పీ సమావేశాలకు సక్రమంగా రాకున్నా.. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినా... చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వానికి సరెండ్‌ చేసేలా ఉత్తర్వులు రెడీ చేయాలంటూ...ఆమె జడ్పీ డిప్యూటీ సీఈఓను ఆదేశించారు. జడ్పీ అదనపు సమావేశ మందిరంలో వ్యవసాయం, మహిళా, సాంఘిక సంక్షేమంపై చర్చ సాగింది. వైస్‌ చైర్‌పర్సన నాగరత్నమ్మ, ఇతర సభ్యులు చలి మొదలైందని, హాస్టళ్లలో పిల్లలకు దుప్పట్లు అందజేయాలన్నారు. సమ్మె నేపథ్యంలో అంగన్వాడీ పిల్లలకు పౌష్టికాహారం అందించాలని అధికారులను ఆదేశించారు.

Updated Date - Dec 17 , 2023 | 11:52 PM