అక్రమార్కులకు కల్పతరువు

ABN , First Publish Date - 2023-05-31T23:39:04+05:30 IST

ఉపాధి హామీ అవెన్యూ ప్లాంటేషన అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటడంతోనే పథకాన్ని అటకెక్కించారు. వాటి సంరక్షణ గాలికొదిలేశా రు.

అక్రమార్కులకు కల్పతరువు

16 పంచాయతీల పరిధిలో 8 వేల మొక్కల పెంపకం

రూ.20 లక్షల బిల్లుల చెల్లింపు

రెండేళ్ల పథకం గడువు పూర్తి

రోడ్లకు ఇరువైపులా కానరాని మొక్కలు

మడకశిర రూరల్‌, మే 31: ఉపాధి హామీ అవెన్యూ ప్లాంటేషన అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటడంతోనే పథకాన్ని అటకెక్కించారు. వాటి సంరక్షణ గాలికొదిలేశా రు. పలు గ్రామాల రోడ్లకు ఇరువైపులా మొక్కల ఆనవాళ్లు కూడా లే కుండా పోయాయి. నిధులేమో నీళ్లలా వెచ్చించారు. ఉపాధి సిబ్బంది, నాయకులు కుమ్మక్కై అందినకాడికి జేబులు నింపుకున్నారన్న ఆరోపణలున్నాయి. మండలవ్యాప్తంగా అన్ని గ్రామాలకు వెళ్లే రోడ్లకు ఇరువైపులా 2021లో అవెన్యూ ప్లాంటేషన కింద మొక్కలు నాటారు. 16 పం చాయితీల పరిధిలో 29 వేల కిలోమీటర్ల మేర, 8 వేల మొక్కలు నా టారు. రెండేళ్ల పాటు మొక్కలకు నీరు, సంరక్షణ కోసం రూ.20 లక్షల నిధులను ప్రభుత్వం కేటాయించింది. ఈఏడాది మార్చి నాటికి అవె న్యూ ప్లాంటేషన గడువు ముగిసింది. మొక్కలను ఉపాధి పథకం కిం ద నాటారు. ఒక్కో మొక్క సంరక్షణ, నీటి కోసం రూ.14ల మేర చెల్లిం చారు. ఇందుకోసం ఆయా గ్రామాల పరిధిలో మొక్కల సంరక్షకులను నియమించారు. అధికారుల పర్యవేక్షణ కొరవడి పథకం అటకెక్కింది. నిధులన్నీ రోడ్డు పాలయ్యాయి. చెట్లు మాయమయ్యాయి. అక్రమా ర్కులపై చర్యలు చేపట్టి, నిధులు రికవరీ చేయాలని ఆయా గ్రామాల ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

బినామీ పేర్లతో నాయకులే కాజేశారు...

రాజగోపాల్‌, తెలుగు రైతు అధ్యక్షుడు

అవెన్యూ ప్లాంటేషన మొక్కల పెంపకంలో చాలామంది వైసీపీ నా యకులే బినామీ పేర్లతో బిల్లులు కాజేశారు. నాటిన మొక్కలకు నీరు, సంరక్షణ మరిచారు. మొక్కల సంగతి దేవుడెరుగ.. గుంతలు కూడా కానరాకుండా పోయాయి.

అధికారుల పర్యవేక్షణ లోపం

నరసింహప్ప, రైతు

ఉపాధిహామీ పథకం కింద గ్రామాలకు వెళ్లే రహదారులకు ఇరువైపులా నాటిన మొక్కలపై సంబంధిత అధికారుల పర్యవేక్షణ కొరవడిం ది. చాలాచోట్ల నాటిన మొక్కలు చిగురించి మధ్యలోనే ఎండిపోయాయి. మొక్కుల పెంపకాన్ని బట్టి అధికారులు బిల్లులు చెల్సించి ఉంటే పథకం సద్వినియోగమయ్యేది.

పథకం గడువు ముగిసింది..

శ్రీకాంతగౌడ్‌, ఏపీఓ

ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన అవెన్యూ ప్లాంటేషన మొక్కల పెంపకం గడువు రెండేళ్లు పూర్తయింది. మండలంలో 29 వేల కిలోమీటర్ల మేర 8 వేల మొక్కలు నాటాం. రూ.20 లక్షల బిల్లులు చెల్లింపులు పూర్తిచేశాం.

Updated Date - 2023-05-31T23:39:04+05:30 IST