మైనింగ్ నిర్వహణకు అనుమతివ్వొద్దు
ABN , First Publish Date - 2023-11-22T00:03:41+05:30 IST
గ్రామాల పరిధిలో మైనింగ్‌కు అనుమతులు ఇవ్వొద్దని మండలంలోని పలుగ్రామాల ప్రజలు, రైతులు జిల్లా అధికారులను కోరారు. మంగళవారం మండలంలోని క్రిష్ణంరెడ్డి పల్లి గ్రామ సమీపంలో మన్నీల, క్రిష్ణంరెడ్డి, చియ్యేడు, కందుకూరు గ్రామాల పరిధిలోని కొండల్లో మైనింగ్ నిర్వహణకు పలు కంపెనీలు దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు.

అనంతపురంరూరల్, నవంబరు 21: గ్రామాల పరిధిలో మైనింగ్‌కు అనుమతులు ఇవ్వొద్దని మండలంలోని పలుగ్రామాల ప్రజలు, రైతులు జిల్లా అధికారులను కోరారు. మంగళవారం మండలంలోని క్రిష్ణంరెడ్డి పల్లి గ్రామ సమీపంలో మన్నీల, క్రిష్ణంరెడ్డి, చియ్యేడు, కందుకూరు గ్రామాల పరిధిలోని కొండల్లో మైనింగ్ నిర్వహణకు పలు కంపెనీలు దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమానికి జేసీ కేతనగార్గ్, కాలుష్య నియంత్రణ మండలి అధికారి కిషోర్‌రెడ్డి, తహసీల్దార్ విజయలక్ష్మి హాజరయ్యారు. కాగా, ఈ కార్యక్రమాన్ని ఆయా గ్రామాల రైతులు, ప్రజలు అడ్డుకున్నారు. ఎనజీఓస్‌కు వాగ్వాదానికి దిగారు. మైనింగ్ అనుమతులలో ఏనజీఓస్‌కు సంబంధం ఏమింటంటూ రైతులు మండిపడ్డారు. ఇప్పటికే ఈ గ్రామాల పరిధిలో ఆరేడు క్రషర్స్‌లు, క్వారీలున్నాయని, మరో మూడింటికి అనుమతులకు ప్రజాభిప్రాయ సేకరణ చేయడం ఏమాత్రం మంచిది కాదని అన్నారు. ఇప్పటికే గ్రామస్థులు అనారోగ్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. కషర్స్ వెలువడే దుమ్ము, ధూళి నుంచి పంట పొలాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఎంటి పరిస్థితుల్లో కొత్త వాటికి అనుమతులు ఇవ్వొదని అధికారులను కోరారు.