పరిహారం పెంచాలంటూ నిర్వాసిత రైతుల ధర్నా

ABN , First Publish Date - 2023-06-03T00:04:07+05:30 IST

గ్రీనఫీల్డ్‌ హైవేలో భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం పెంచాలంటూ శుక్రవారం ఆందోళనకు దిగారు. నాయనకోట, నాయనకోట తండా, వీరప్పగారిపల్లి, బొంతపల్లి, కొండతిమ్మయ్యగారిపల్లి రైతులు స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.

పరిహారం పెంచాలంటూ నిర్వాసిత రైతుల ధర్నా

ఓబుళదేవరచెరువు, జూన 2: గ్రీనఫీల్డ్‌ హైవేలో భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం పెంచాలంటూ శుక్రవారం ఆందోళనకు దిగారు. నాయనకోట, నాయనకోట తండా, వీరప్పగారిపల్లి, బొంతపల్లి, కొండతిమ్మయ్యగారిపల్లి రైతులు స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ ఎకరాకు రూ.20 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 15 రోజుల నుంచి కేంద్ర ప్రభుత్వం తమ పొలాల్లో నేషనల్‌ హైవే పనులు చేస్తున్నారని తెలిపారు. నిరుపేద కుటుంబాలైన తమకు భూములే జీవనాధారమని, పరిహారం పెంచాలని కోరారు. అనంతరం తహసీల్దార్‌ శ్రీధర్‌కు వినతిపత్రం అందజేశారు. నిరసనకు సీఐటీయూ నాయకులు శ్రీరాములు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం వెంకటరమణ, టీడీపీ నాయకులు నాయనకోట ఆంజనేయులు, రైతులు ప్రసాద్‌నాయక్‌, చిన్నప్పయ్య, రామచంద్ర, గంగులప్ప పాల్గొన్నారు.

Updated Date - 2023-06-03T00:04:07+05:30 IST