బాబుతోనే అభివృద్ధి
ABN , First Publish Date - 2023-11-19T23:34:49+05:30 IST
అనంతపురం అర్బనలోని పలు డివిజన్లల్లో ఆదివారం బాబు ష్యూరిటీ - భవిష్యతకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఆంధ్రజ్యోతి, న్యూస్ నెట్‌వర్క్ : అనంతపురం అర్బనలోని పలు డివిజన్లల్లో ఆదివారం బాబు ష్యూరిటీ - భవిష్యతకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమన్నారు. టీడీపీ మేనిఫెస్టోకు సంబంధించిన కరపత్రాలు పంపిణీ చేశారు. రూరల్ మండలంలోని రుద్రంపేట పంచాయతీ చంద్రబాబు కొట్టాల్లో మైనార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఫిరోజ్ అహ్మద్, టీఎనటీయూసీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మోహనకుమార్, మణికంఠబాబు కరపత్రాలు పంచారు. శింగనమల మండలంలోని గోవిందరాయునిపేటలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు.