టీడీపీతోనే బీసీల అభ్యున్నతి : గుండుమల
ABN , Publish Date - Dec 24 , 2023 | 12:25 AM
టీడీపీతోనే వెనకబడిన వర్గాల అభ్యున్నతి సాధ్యమని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి అన్నారు.
మడకశిరటౌన, డిసెంబరు 23: టీడీపీతోనే వెనకబడిన వర్గాల అభ్యున్నతి సాధ్యమని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి అన్నారు. ఎంతో మంది బీసీలకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన ఏకైక పార్టీ టీడీపీనే అన్నారు. తెలుగుదేశం పార్టీ బీసీ భరోసా బాట కరపత్రాలను ఆయన స్థానిక టీడీపీ కార్యాలయంలో శనివారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నాయీ బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు రామాంజ నేయులు, మైనారిటీ అధ్యక్షుడు భక్తర్, నాయకులు కాంతరాజు, నాగేంద్ర, రమేష్, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
మడకశిర టౌన: రాష్ట్రం సమగ్ర అభి వృద్ధి సా ధించా లంటే ఒక్క తెలుగు దేశం పార్టీతోనే సా ధ్యమవు తుందని, కష్టకాలంలో గట్టె క్కించే ఏకైక నా యకుడు చంద్రబాబే అని నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆర్ జయకుమార్ అన్నారు. అమరాపురం మండల పరిధిలోని కొర్రేవు, హేమావతి, గుణేహళ్లి గ్రామాల్లో శనివారం బాబు ష్యూరిటీ భవిషత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడపీ నాయకులు కృష్ణమూర్తి, రంగప్ప, శ్రీనివాసులు, నారాయణప్ప, రాజశేఖర్, సుజాత, మాజీ ఎంపీటీసీ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
మడకశిరటౌన: వైసీపీ అవినీతి పాలనకు చరమగీతం పాడాలని, జగన పాలనతో రాష్ట్రం అ స్తవ్యస్తం అయిందని టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి నాగరాజు అన్నారు. ఇలాంటి తరుణంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు సాగాలంటే టీడీపీ అధినేత చంద్ర బాబుతోనే సాధ్యమని అన్నారు. శనివారం పట్టణంలోని 18వ వార్డులో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోవిందప్ప, కరియన్న, హనుమంతేగౌడ్, రామప్ప, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.