Share News

పెద్దమ్మ తల్లి ఆలయం కూల్చివేత

ABN , First Publish Date - 2023-11-30T00:18:59+05:30 IST

మండలంలోని బొమ్మలా టపల్లి గ్రామంలో గ్రామ పెద్దమ్మ దేవాలయాన్ని బుధవారం వేకుజామున గుర్తు తెలియని దుండుగులు కూల్చివేశా రు. 3

పెద్దమ్మ తల్లి ఆలయం కూల్చివేత
పెద్దమ్మ దేవాలయాన్ని కూల్చివేసిన దృశ్యం

బుక్కరాయసముద్రం, నవంబరు 29: మండలంలోని బొమ్మలా టపల్లి గ్రామంలో గ్రామ పెద్దమ్మ దేవాలయాన్ని బుధవారం వేకుజామున గుర్తు తెలియని దుండుగులు కూల్చివేశా రు. 30 సంవత్సరాల క్రితం గ్రామ ప్రజలు చందాలు వేసుకుని ఈ ఆలయాన్ని నిర్మించుకు న్నారు. నిత్యం అమ్మవారికి పూజలు నిర్వహిం చేవారు. కాగా, బుధవారం వేకుజామున గుర్తు తెలియని దుండుగులు ఆ ఆలయాన్ని కూల్చివేశారు. దీనిపై బుధవారం రాత్రి పోలీసులకు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడుతూ.. ఆలయం పక్కనే ఉన్న చెలిమి భూషణ, మెహన, ఆంజినేయులు ఆలయ స్థలాన్ని కబ్జా చేయాలని ఉద్దేశంతో ధ్వంసం చేసినట్లు ఫిర్యాదు చేశామన్నారు. గత ఆదివారం ఆలయం వద్ద అన్నదానం నిర్వహి స్తుండగా వారే అడ్డుకున్నారన్నారు. ఇంటిప క్కనే ఉన్న ఆలయాన్ని కూల్చివేస్తే ఆ స్థలాన్ని కబ్జా చేయవచ్చనే ఉద్దేశంతోనే ఈ ఘటనకు పాల్పడినట్లు ఆరోపించారు. నిందితులును వెంటనే అరెస్టు చేయాలన్నారు. వీటితో పాటు అమ్మవారి వెండి ఆభరణాలనూ దొంగలిం చారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎస్‌ఐ శ్రీనివాసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-11-30T00:19:00+05:30 IST