Share News

వైసీపీ ఓటమి ఖాయం

ABN , Publish Date - Dec 22 , 2023 | 11:39 PM

వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని మాజీ మంత్రి ప రిటాల సునీత పేర్కొన్నారు. టీడీపీ అధికా రంలోకి వస్తేనే అభివృద్ధి, సంక్షేమం సాధ్య మని అన్నారు

వైసీపీ ఓటమి ఖాయం
రాప్తాడులో ప్రచారం చేస్తున్న మాజీ మంత్రి పరిటాల సునీత

రాప్తాడు, డిసెంబరు 22: వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని మాజీ మంత్రి ప రిటాల సునీత పేర్కొన్నారు. టీడీపీ అధికా రంలోకి వస్తేనే అభివృద్ధి, సంక్షేమం సాధ్య మని అన్నారు. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా మూడో రోజైన శుక్రవారం ఇంటింటి ప్రచారం చేశారు. టీడీపీ మేనిఫెస్టో కరపత్రాలను ప్రజలకు అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్‌ కొండప్ప, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, కురువసాధికారసమితి రాష్ట్ర కన్వీనర్‌ గంగులకుంట రమణ, బీసీసెల్‌ రాష్ట్ర కార్యదర్శి నారాయణస్వామి, మరూరు గోపాల్‌, ఇంద్ర, సర్పంచలు తిరుపాల్‌, శీనయ్య, బాబయ్య పాల్గొన్నారు.

Updated Date - Dec 22 , 2023 | 11:39 PM