పంట నష్టపరిహారం ఇవ్వాలి : సీపీఎం
ABN , First Publish Date - 2023-09-04T23:34:30+05:30 IST
వర్షాలు, కరెంటు కోతల కారణంగా ఎండిపో తున్న పంటలకు ఎకరానికి రూ.50వేలు నష్ట పరిహారం ఇవ్వాలని సీపీఎం మండల కార్యదర్శి రామాంజినేయులు డిమాండ్ చేశారు.
అనంతపురంరూరల్, సెప్టెంబరు 4: వర్షాలు, కరెంటు కోతల కారణంగా ఎండిపో తున్న పంటలకు ఎకరానికి రూ.50వేలు నష్ట పరిహారం ఇవ్వాలని సీపీఎం మండల కార్యదర్శి రామాంజినేయులు డిమాండ్ చేశారు. సోమవారం తహసీల్దార్ కార్యాల యంలో జరిగిన గ్రీవెన్సలో తహసీల్దార్ శ్రీధరమూర్తికి వినతిపత్రం ఇచ్చారు. విద్యుత కోతలు నివారించి విద్యుత చార్జీలు తగ్గించా లన్నారు. వ్యవసాయానికి కోతలు లేకుండా 9గంటల విద్యుత సక్రమంగా అందించా లన్నారు. రైతుల బ్యాంకు రుణాలు మాఫీ చేయాలన్నారు. ఈకార్యక్రమంలో నాయకు లు పుష్పరాజు, ఆదినారాయణ, పెద్దన్న, నాగరాజు సుధాకర్, సురేష్ పాల్గొన్నారు.