కొనసాగిన మున్సిపల్ కార్మికుల సమ్మె
ABN , Publish Date - Dec 28 , 2023 | 12:26 AM
పుట్టపర్తి, డిసెంబరు 27: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పట్టణంలోని మున్సిపల్ కార్మికులు రెండోరోజు బుధవారమూ రిలేదీక్ష కొనసాగించారు.
- టీడీపీ, జనసేన మద్దతు
పుట్టపర్తి, డిసెంబరు 27: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పట్టణంలోని మున్సిపల్ కార్మికులు రెండోరోజు బుధవారమూ రిలేదీక్ష కొనసాగించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద టీడీపీ, జనసేన, సీపీఎం, సీపీఐ నాయకులు మద్దతు తెలపగా, కార్మికులు రిలే దీక్ష కొనసాగించారు. పలువురు నాయకులు మాట్లాడుతూ.. కార్మికుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. పారిశుధ్య కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని పేర్కొన్నారు. కార్యక్రమంలో సా మకోటి ఆదినారాయణ, అబ్దుల్, డాక్టర్ తిరుపేం ద్ర, రాము, గంగాధర్, కార్మిక నాయకులు పీట్ల రమణ, కార్మికులు పాల్గొన్నారు.