Share News

టీడీపీ ఓట్లను తొలగించే కుట్ర: కాలవ

ABN , First Publish Date - 2023-12-09T23:48:02+05:30 IST

నియోజక వర్గంలో టీడీపీ సానుభూతిపరుల 32 వేల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని మాజీమంత్రి కాల వ శ్రీనివాసులు పేర్కొన్నారు. దీనిపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, క్లస్టర్‌ ఇనచార్జులు, యూనిట్‌ ఇనచార్జులు, బీఎల్‌ఏలు జాగ్రత్తగా ఉండాలన్నారు.

టీడీపీ ఓట్లను తొలగించే కుట్ర: కాలవ

బొమ్మనహాళ్‌, డిసెంబరు 9: నియోజక వర్గంలో టీడీపీ సానుభూతిపరుల 32 వేల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని మాజీమంత్రి కాల వ శ్రీనివాసులు పేర్కొన్నారు. దీనిపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, క్లస్టర్‌ ఇనచార్జులు, యూనిట్‌ ఇనచార్జులు, బీఎల్‌ఏలు జాగ్రత్తగా ఉండాలన్నారు. మండలంలోని ఎల్‌బీనగర్‌ గ్రామంలో టీడీపీ మండల కన్వీనర్‌ బలరాంరెడ్డి అధ్యక్షతన శనివారం బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం పై చర్చించడానికి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ వైసీపీ నేతలు తమ అనుకూలమైన వారిని వలంటీర్లుగా పెట్టుకుని టీడీపీకి ఓటు ఎవరు వేస్తారు అని గుర్తించి వారి ఓట్లు తొలగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కళ్ళుహోళ గ్రామంలో పాటిల్‌ నాగరాజు కుటుంబానికి చెందిన సౌమ్య అనే వలంటీర్‌ ద్వారా ఓట్లను తొల గించే కుట్ర జరుగుతోందన్నారు. ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఓట్లను తొలగించ డానికి అనేక అక్రమాలకు పాల్పడుతున్నాడని విమర్శించారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేస్తున్న అక్రమాలను బహిర్గతం చేయాలని పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని తెలిపారు. కాపు రామచంద్రారెడ్డి నేమకల్లు ప్రాంతంలో కొండలను అక్రమ తవ్వకాలు చేసి కోట్లాది రూపాయలు కూడగట్టుకున్నారన్నారు. క్వారీకి రూ. రెండు కోట్ల బకాయిలు ఎగ్గొట్టి, కొలతల కోసం అధికారులు వస్తే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండతో వారిని వెనక్కి పంపించారని విమర్శించారు. అవినీతి మచ్చలేని నాయకుడు చంద్రబాబు నాయుడును జైల్లో పెట్టిన ఈ సైకో ప్రభుత్వాన్ని ఓడించాలని కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి ఉంటే ఉంతకల్లు వద్ద రిజర్వాయర్‌కు మహర్దకు వచ్చేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలుగురైతు రాష్ట్ర ఉపాధ్యక్షులు కేశవరెడ్డి, చంద్రహాస్‌, కుమ్మరి మల్లికార్జున, మాలపాటి ధనుంజయ, యర్రగుంట్ల వెంకటేశులు, చలపతి, అప్పారావు, పయ్యావుల మోహన, ఎస్‌పీ నాగరాజు, గోరంట్ల వెంకటేశులు, శ్యామల తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-12-09T23:48:03+05:30 IST