ప్రకృతి పరిరక్షణ మానవ బాధ్యత : గోపీచంద్‌

ABN , First Publish Date - 2023-03-19T00:22:38+05:30 IST

ప్రకృతి పరిరక్షణ మానవ బాధ్యతని, విరివిగా మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తేనే భవిష్యత తరాలకు మనుగడ ఉంటుందని బ్యాడ్మింటన క్రీడాకారుడు, కోచ పుల్లెల గోపీచంద్‌ పేర్కొన్నారు.

ప్రకృతి పరిరక్షణ మానవ బాధ్యత : గోపీచంద్‌


అనంతపురం సెంట్రల్‌, మార్చి 18: ప్రకృతి పరిరక్షణ మానవ బాధ్యతని, విరివిగా మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తేనే భవిష్యత తరాలకు మనుగడ ఉంటుందని బ్యాడ్మింటన క్రీడాకారుడు, కోచ పుల్లెల గోపీచంద్‌ పేర్కొన్నారు. శనివారం శ్రీజీ ప్రకృతి ధర్మపీఠం ట్రస్టు, ఆర్ట్స్‌ కళాశాల ఎకో క్లబ్‌ సంయుక్తాధ్వర్యంలో ఉగాది పురస్కారాలు-2023 ప్రధానోత్సవాన్ని నిర్వహించారు. ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ దివాకర్‌రెడ్డి అధ్యక్షతన ఆర్ట్స్‌ కళాశాల డ్రామాహాల్‌లో ఏర్పాటుచేసిన ప్రధానోత్సవానికి శ్రీజీ ప్రకృతి ధర్మపీఠం ట్రస్టు ప్రతినిధి, బ్యాడ్మింటన కోచ పుల్లెల గోపీచంద్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహజన వనరుల వినియోగం, పట్టణ, నగర విస్తరణ వంటి అంశాలు ప్రకృతిని ధ్వంసం చేసేవిధంగా మానవాళి ప్రవర్తన ఉండరాదన్నారు. అందరికి ఆధార్‌ కార్డులాగా ప్రతిఒక్కరికి ఒక మొక్క దాని సంరక్షణ నినాదంరావాలని పిలుపునిచ్చారు. అనంతరం పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపుదలకు కృషిచేసిన 45మందికి ఉగాది పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ హనుమంతు, డాక్టర్‌ దివాకర్‌రెడ్డి, శ్రీజీ ప్రకృతి ధర్మపీఠం ట్రస్టు చైర్మన శ్రీనివాసులు, ట్రెజరర్‌ రక్షిత, నగర డిప్యూటీమేయర్‌ కోగటం విజయభాస్కర్‌రెడ్డి, మాసినేని రామయ్య, ఆధరణ రామకృష్ణ, అబ్దుల్‌కలాం పౌండేషన చైర్మన బాషా, గాయకుడు లెనిన బాబు, ప్రకృతిప్రేమికుడు బైరెడ్డి, ఎస్కేయూ మాజీ రిజిస్ర్టార్‌ ప్రొఫెసర్‌ సుధాకర్‌బాబు, ఆర్ట్స్‌ కళాశాల అధ్యాపకులు రఘురాములు, చంద్రశేఖర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, శ్రీధర్‌, చంద్రకళ, అమృతలక్ష్మి, అరుణశ్రీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-19T00:22:38+05:30 IST