తోలుబొమ్మల కళపై సదస్సు

ABN , First Publish Date - 2023-02-21T23:25:12+05:30 IST

తోలుబొమ్మల కళపై పుట్టపర్తిలోని సాయికృప ఆశ్రమంలో సదస్సు కొనసాగింది. రెండోరోజు మంగళవారం తోలుబొమ్మల కళపై విదేశీయులకు అవగాహన కల్పించారు.

తోలుబొమ్మల కళపై సదస్సు
తోలుబొమ్మల కళపై అవగాహన కల్పిస్తున్న కళాకారులు

పుట్టపర్తిరూరల్‌, ఫిబ్రవరి21: తోలుబొమ్మల కళపై పుట్టపర్తిలోని సాయికృప ఆశ్రమంలో సదస్సు కొనసాగింది. రెండోరోజు మంగళవారం తోలుబొమ్మల కళపై విదేశీయులకు అవగాహన కల్పించారు. పుట్టపర్తి వేదికగా తోలుబొమ్మల కళను ప్రపంచానికి చాటిచెప్పడమే లక్ష్యమని నిమ్మలకుంట తోలుబొమ్మల కళాకారుడు దళవాయి కుళ్లాయప్ప పేర్కొన్నారు. భారతీయ సంస్కృతిలో తోలుబొమ్మలది విశిష్ట స్థానమన్నారు. మహాభారతం, రామయాణం, ఇతర ఇతిహాసాలను తోలుబొమ్మల రూపంలో ప్రజలకు వివరించేవారన్నారు. మారుతున్న కాలానుగుణంగా తోలుబొమ్మలను తయారు చేస్తున్నామనీ, దీంతో ప్రజలు ఆదరిస్తున్నారన్నారు. ఈనెల 23వ తేదీ వరకు సదస్సు కొనసాగుతుందన్నారు. సదస్సులో తోలుబొమ్మల తయారీ, ఆడించడంపై కళాకారులు వివరించారు.

Updated Date - 2023-02-21T23:25:13+05:30 IST