Share News

వైసీపీలో కోల్డ్‌ వార్‌

ABN , Publish Date - Dec 22 , 2023 | 12:24 AM

అధికారపార్టీ వైసీపీలో కోల్డ్‌వార్‌ మరోసారి బహిర్గమైంది. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి జన్మదిన వేడుక ఇందుకు వేదికగా మారింది. బుధవారం అర్ధరాత్రి వైఎస్‌ఆర్‌ విగ్రహం వద్ద వైసీపీ శ్రేణులతో కలిసి ఎంపీపీ బోగాతి మురళీధర్‌రెడ్డి, జడ్పీటీసీ లావనూరు శోభారాణి భర్త మధుసూదనగుప్తా జగన జన్మదిన వేడుకను జరిపారు.

వైసీపీలో కోల్డ్‌ వార్‌

వర్గాలుగా అధినేత జన్మదిన వేడుకల నిర్వహణ

పామిడి, డిసెంబరు 21: అధికారపార్టీ వైసీపీలో కోల్డ్‌వార్‌ మరోసారి బహిర్గమైంది. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి జన్మదిన వేడుక ఇందుకు వేదికగా మారింది. బుధవారం అర్ధరాత్రి వైఎస్‌ఆర్‌ విగ్రహం వద్ద వైసీపీ శ్రేణులతో కలిసి ఎంపీపీ బోగాతి మురళీధర్‌రెడ్డి, జడ్పీటీసీ లావనూరు శోభారాణి భర్త మధుసూదనగుప్తా జగన జన్మదిన వేడుకను జరిపారు. పట్టణంలోని ఏడీసీసీబీ వద్ద ఆ బ్యాంక్‌ చైర్‌పర్సన లిఖిత, మాజీ చైర్మన వీరాంజనేయులు మహిళలు, కార్యకర్తలతో ర్యాలీ చేసి జగన పుట్టిన రోజును జరుపుకున్నారు. వైఎస్‌ఆర్‌ విగ్రహం వద్ద మాజీ ఎంపీపీ, మండల కన్వీనర్‌ నారాయణరెడ్డి, పట్టణ కన్వీనర్‌ జోజోడే కుమార్‌ సీఎం జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఇలా అధికారపార్టీ నాయకులు తమ అనుచరగణంతో విడతల వారీగా జన్మదిన వేడుకలు చేయడం మండలంలో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలా ఎవరికి వారే యమునా తీరే.. అన్నరీతిన వేడుకలు నిర్వహించడం హాట్‌ టాపిక్‌గా మారింది.

Updated Date - Dec 22 , 2023 | 12:24 AM