గుంతల రోడ్లపై అన్ని పార్టీలు పోరాడినా స్పందించని సీఎం
ABN , Publish Date - Dec 31 , 2023 | 12:07 AM
జాతీయ రహదారులపై పెద్ద పెద్ద గుంతలు పడడంతో టీడీపి, బీజేపి, జనసేన, సీపీఐ, సీపీఎం పార్టీలు పోరాడినప్పటికీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి స్పందించి, ఎక్కడే కానీ గంప మట్టివేసిన పాపాన పోలేదని కదిరి మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు.
మాజీ ఎమ్మల్యే కందికుంట వెంకటప్రసాద్
ముదిగుబ్బ, డిసెంబర్ 30: జాతీయ రహదారులపై పెద్ద పెద్ద గుంతలు పడడంతో టీడీపి, బీజేపి, జనసేన, సీపీఐ, సీపీఎం పార్టీలు పోరాడినప్పటికీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి స్పందించి, ఎక్కడే కానీ గంప మట్టివేసిన పాపాన పోలేదని కదిరి మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ముదిగుబ్బలో జాతీయ రహదారిపై గుంతలు ఏర్పడడంతో సీపీఐ పార్టీ నాయకులు శనివారం జాతీయ రహదారిపై రాస్తారోకో చేస్తుండడంతో ముదిగుబ్బ మీదుగా అనంతపురం వెళుతున్న కదిరి మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ రాస్తారోకో వద్దకు చేరుకొని సీపీఐ నాయకులకు సంఘీభావం తెలిపారు. ఈ సంధర్భంగా కందికుంట వెంకటప్రసాద్ మాట్లాడుతూ అయ్యా జగన మోహన రెడ్డి నేను విన్నాను, నేను ఉన్నాను అంటూనే ఉన్నావు, రహదారిలపై గుంతలు ఏర్పడడంతో వాటిపై వివిధ పార్టీలు పోరాటం చేస్తుంటే అవి ఎందుకు వినిపించలేదని ప్రశ్నించారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులతో జాతీయ రహదారి ఏర్పాటు అవుతున్నాయే తప్ప, రాష్ట్ర రహదారుల అభివృధ్ది ఎక్కడ చేయలేదంటూ విమర్శించారు, ఇలాంటి సీఎంను ఎక్కడ చూడలేదంటూ ఎద్దేవ చేశారు. అనంతరం సీపీఐ పార్టీ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు మాట్లాడుతూ రహదారులు పెద్ద ఎత్తున గుంతలు ఏర్పడడంతో నేటికీ వైసీపి ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమం టీడీపి నాయకులు తుమ్మల మనోహర్, గడ్డంసూరి, నారాయణస్వామి, సీపీఐ నాయకులు తిప్పయ్య, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.