భూముల విలువ పెంపుపై రాని స్పష్టత

ABN , First Publish Date - 2023-06-01T00:03:40+05:30 IST

రాష్ట్రంలో గురువారం (జూన1) నుంచి భూముల ధరలు పెంచేలా ప్రభుత్వం నిర్ణయించినా.. తమకు ఇంకా ఆదేశాలు రాలేదని స్టాంపులు, రిజిస్ర్టేషన్ల శాఖ అధికారులు చెబుతున్నారు.

  భూముల విలువ పెంపుపై రాని స్పష్టత

అనంతపురం క్రైం, మే 31: రాష్ట్రంలో గురువారం (జూన1) నుంచి భూముల ధరలు పెంచేలా ప్రభుత్వం నిర్ణయించినా.. తమకు ఇంకా ఆదేశాలు రాలేదని స్టాంపులు, రిజిస్ర్టేషన్ల శాఖ అధికారులు చెబుతున్నారు. అత్యధిక ఆదాయం వచ్చే 20 శా తం గ్రామాల్లో భూముల విలువ పెంచాలని ప్రభుత్వం నిర్ణ యం తీసుకుంది. దీంతో ఆ మేరకు మార్కెట్‌ వాల్యూ ప్రకారం రిజిస్ర్టేషన ప్రక్రియ చేపట్టడానికి అధికారులు సిద్ధమయ్యారు. గురువారం ఉదయం ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే అమలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా భూముల విలువ పెరగనున్న నేపథ్యంలో రెండు రోజుల పాటు రిజిస్ర్టేషన్ల కార్యా లయాలు కిటకిటలాడాయి. అయితే సర్వర్‌ డౌన కావడంతో రిజిస్ర్టేషన్లు జరగక తీవ్ర ఇబ్బందులు గురయ్యారు. బుధవారం సాంకేతిక సమస్య తొలగడంతో రిజిస్ర్టేషన్లు జరిగాయి.

30 నుంచి 35 శాతం పెంపు : భూముల విలువ రెండేళ్లుగా కరోనా కారణంగా పెంచలేదు. గత ఏడాది కేవలం కొత్తగా ఏర్ప డిన జిల్లాలకు మాత్రమే ధరలు పెంచారు. ఈ సంవత్సరం 30 నుంచి 35 శాతం వరకు రేట్లు పెరగనున్నాయి. కానీ కొందరు ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతో అవసరం లేకపోయినా భూముల ధరలు పెంచనున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2023-06-01T00:03:40+05:30 IST