భక్తుల కొంగుబంగారం చౌడేశ్వరీదేవి

ABN , First Publish Date - 2023-04-03T00:11:04+05:30 IST

నేటి అమడగూరును గతంలో అమరావతి పట్టణంగా పలిచేవారని స్థానిక కథనం ద్వారా తెలుస్తోంది. మండలకేంద్రంలో వెలసిన చౌడేశ్వరీ ఆలయం, ఆలయంలోని అమ్మవారి విశిష్టతపై స్థానికంగా పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి.

భక్తుల కొంగుబంగారం చౌడేశ్వరీదేవి

6 నుంచి బ్రహోత్సవాలు

అమడగూరు, ఏప్రిల్‌ 2: నేటి అమడగూరును గతంలో అమరావతి పట్టణంగా పలిచేవారని స్థానిక కథనం ద్వారా తెలుస్తోంది. మండలకేంద్రంలో వెలసిన చౌడేశ్వరీ ఆలయం, ఆలయంలోని అమ్మవారి విశిష్టతపై స్థానికంగా పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. దాదాపు 800 ఏళ్ల క్రితం ఈ ప్రాంతాన్ని పాలించిన శ్రీరంగరాజు నిర్మించిన ఆలయంలో ఉన్న మూలవిరాట్‌ను అమడగూరమ్మగా కొలుస్తుండేవారు. నేడు ఆ దేవతే చౌడేశ్వరిగా విరాజిల్లుతోంది. కాలక్రమేణ అమరాతి పట్టణమే అమడగూ రుగా రూపాంతరం చెందింది. నాటి నుంచి ప్రతి సంవత్సరం ఉగాది పండుగను పురస్కరించుకుని చైత్ర మాసంలో ఆలయంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా మారింది. ఉగాది పండుగ రోజు నుంచి 15రోజులపాటు అమడగూరు, చీకిరేవులపల్లి, గండువారిపల్లి పంచా యతీల్లోని 16గ్రామల్లో అమ్మవారి ఊరేగింపు నిర్వహిస్తారు. అనంతరం పౌర్ణమిరోజు అమ్మవారిని ఆలయానికి చేర్చి, కుం భం కూడు కార్యక్రమం నిర్వహిస్తారు. దీంతో ప్రారంభమైన ఉత్సవాలను ఎనిమిది రోజులపాటు వైభంగా నిర్వహిస్తారు. కుంభకూడు మరుసటి రోజు శీతిరెడ్డిపల్లి గ్రామస్థులు ఊయలోత్సవం నిర్వస్తారు. మూడు, నాలుగురోజుల్లో నల్లగుట్లపల్లి వాసులు సూర్య ప్రభ వాహనం, అమడగూరు బలిజ, బ్రాహ్మ ణ కులస్థులు చంద్ర ప్రభ వాహన సేవ నిర్వహిస్తారు. ఐదో రోజు జ్యోతి ఉత్సవాన్ని ఏ కొత్తపల్లికి చెందిన మాజీ జడ్పీటీసీ పొట్టా పురుషోత్తమరెడ్డి కుటుంబసభ్యులు నిర్వహిస్తారు. ఆరో రోజు అశ్వవాహనాన్ని రెడ్డివారిపలికి చెందిన ఎర్రమరెడ్డి కుటుంబసభ్యులు, ఏడో రోజు సింహవాహన సేవను కొలిమిరాళ్లపల్లికి చెందిన కడగుట్ట సుబ్బిరెడ్డి కుటుంబ సభ్యులు, ఎనిమిదో రోజు హంస వాహనాన్ని గాజులపల్లికి చెందిన ముదిగుబ్బ సుబ్బరాయప్ప కుటుంబ సభ్యులు నిర్వహిస్తారు. ఈ నెల ఆరో తేదీ నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.

ఆలయాభివృద్ధికి కర్ణాటక భక్తుల సహకారం

కర్ణాటక రాష్ట్రానికి చెందిన కొన్నివర్గాల ప్రజలు తమ ఇంటి ఆడపడుచుగా చౌడేశ్వరీ దేవిని కొలుస్తున్నారు. ఆలయ ప్రాంతంలో బెంగళూరుకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే క్రిష్టప్ప, మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసులుతోపాటు మరికొంతమంది భక్తుల సహకారంతో ఆలయాభివృద్ధి జరిగింది. అలాగే కల్యాణమండపం, విశ్రాంతి భవనాలు నిర్మించారు. ఎమ్మెల్యే క్రిష్టప్ప కల్యాణమండలం వద్ద ప్రతిరోజు 50మంది అనాథలకు, వృద్ధులకు నిత్యాన్నదానం నిర్వహిస్తున్నారు.

Updated Date - 2023-04-03T00:11:20+05:30 IST