విద్యుత సర్వీసుల కోసం డబ్బు వసూలు
ABN , First Publish Date - 2023-03-19T00:23:45+05:30 IST
విద్యుత మోటార్ల సర్వీస్ కనెక్షన కోసం రై తుల నుంచి ట్రాన్సకో లైనమన మనోజ్‌కుమార్ డబ్బులు వసూలు చేసి, స్వాహాచేసిన సంఘటన ఆలస్యంగా శనివారం వెలుగులోకి వ చ్చింది.

లైనమన సస్పెన్షన
రొద్దం, మార్చి 18: విద్యుత మోటార్ల సర్వీస్ కనెక్షన కోసం రై తుల నుంచి ట్రాన్సకో లైనమన మనోజ్‌కుమార్ డబ్బులు వసూలు చేసి, స్వాహాచేసిన సంఘటన ఆలస్యంగా శనివారం వెలుగులోకి వ చ్చింది. మండలంలోని గోనిమేకలపల్లికి చెందిన లైనమన మనోజ్‌కుమార్ ఏడాదిన్నర క్రితం పలువురు రైతులతో సర్వీసు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేశారు. గ్రామ రైతులు రంగప్ప మూడు సర్వీసులకు రూ.70 వేలు, కుల్లాయప్ప రూ.14 వేలు, సుబ్బరాయప్ప రెండు సర్వీసులకు రూ.30వేలు, జల్లప్ప భార్య పేరున రూ.11 వేలు వసూలు చేశాడు. ఏడాదిన్నరకాలం గడిచినా విద్యుత సర్వీసులు ఇ వ్వలేదు. దీంతో లైనమనను రైతులు విద్యుత సర్వీసులు నిలదీసినా ఇవ్వకపోవడంతో పోలీస్ స్టేషనలో ఫిర్యాదు చేశారు. పోలీసులు కూ డా రైతులకు న్యాయం చేయకపోవడంతో ఏమిచేయాలో దిక్కుతోచ ని పరిస్థితుల్లో రైతులు పడ్డారు. రెడ్డిపల్లి, దొడగట్ట, గోనిమేకలపల్లి, పెద్దగువ్వలపల్లి గ్రామాల్లో రైతుల నుంచి రూ.లక్షలాది రూపాయ లు వసూలు చేసి స్వాహా చేశారన్న విమర్శలున్నాయి. రైతుల నుం చి ఫిర్యాదులు అందడంతో లైనమనను ట్రాన్సకో అధికారులు స స్పెండ్ చేసినట్లు తెలిసింది. లైనమెన లేని కారణంగా గ్రామాల్లో వి ద్యుత అంతరాయం కలిగినప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈవిషయంపై ట్రాన్సకో ఏడీ కరుణాకరణ్‌ను వివరణ కోర గా, లైనమనపై వచ్చిన ఆరోపణలతో సస్పెండ్ చేసినట్లు తెలిపారు. రైతులు ఆనలైనలో మాత్రమే సర్వీసులకు దరఖాస్తు చేసుకోవాలని, నగదు ఎవరి చేతికిచ్చి మోసపోకుండని సూచించారు. లైనమనపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నామన్నారు. ఎలాంటి సమస్యలు వచ్చినా తనకు ఫిర్యాదు చేయాలని కోరారు.