చంద్రబాబు అరెస్టు దుర్మార్గం
ABN , First Publish Date - 2023-09-23T00:22:40+05:30 IST
అవినీతి మరక అంటని ప్రజా సేవకుడు నారా చంద్రబాబునాయుడుని దుర్మార్గంగా అరెస్టు చేశారని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు. రాయదుర్గంలో ఎన్టీఆర్ విగ్రహం ఎదుట శుక్రవారం ఆయన ఆమరణ నిరాహార దీక్షను చేపట్టారు.
ఫ మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు
ఫ ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఆమరణ దీక్ష
రాయదుర్గం, సెప్టెంబరు 22: అవినీతి మరక అంటని ప్రజా సేవకుడు నారా చంద్రబాబునాయుడుని దుర్మార్గంగా అరెస్టు చేశారని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు. రాయదుర్గంలో ఎన్టీఆర్ విగ్రహం ఎదుట శుక్రవారం ఆయన ఆమరణ నిరాహార దీక్షను చేపట్టారు. అక్కడే విలేకరులతో మాట్లాడారు. తెలుగు ప్రజలు బాగుండాలని చంద్రబాబు అవిశ్రాంతంగా కష్టపడుతున్నారని అన్నారు. ఆయనను అరెస్టు చేయడం అన్యాయమని అన్నారు. చంద్రబాబు జైలు నుంచి విడుదలయ్యే వరకు ఆమరణ దీక్ష కొనసాగిస్తానని ప్రకటించారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థలో ఎక్కడా అవినీతి జరగలేదని, అక్రమాలకు చోటేలేదని ఇప్పటికే అనేక సంస్థలు నిర్ధారించాయని అన్నారు. ఈ విషయం ద ర్యాప్తు అధికారులకు, సీఎం జగనకు స్పష్టంగా తెలుసని అన్నారు. చంద్రబాబు, నారా లోకే్‌షకు వస్తున్న జనాదరణ చూసి ఓర్చుకోలేక కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్డులోనూ ఎలాంటి అవినీతి జరగలేదని అన్నారు. ఈ వాస్తవాలను ప్రజల ముందు తమ పార్టీ ఉంచిందని అన్నారు. ప్రజాస్వామ్యవాదులు, మేధావులు వాస్తవాలను అర్థం చేసుకోవాలని కాలవ విజ్ఞప్తి చేశారు. సత్యాన్ని సమాధి చేస్తున్న జగన దురహంకారానికి వ్యతిరేకంగా ఐక్యపోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. కాలవ దీక్షకు జనసేన నియోజకవర్గ ఇనచార్జి కరేగౌడ్ర మంజునాథ్, సీపీఐ తాలూకా కార్యదర్శి నాగార్జున తదితరులు సంఘీభావం తెలిపారు. కాలవతోపాటు మున్సిపల్ మాజీ కౌన్సిలర్ టంకశాల హనుమంతు, తెలుగు యువత కణేకల్లు మండల అధ్యక్షుడు బాయినేని నవీన, సీనియర్ నాయకులు శరబణ్ణగౌడ్, బీటీపీ ఆంజనేయులు ఆమరణ దీక్షకు కూర్చున్నారు.