రాజకీయాల్లో చంద్రబాబు ఆదర్శం
ABN , First Publish Date - 2023-09-26T00:04:48+05:30 IST
రాజకీయాల్లో చంద్ర బాబు ఆదర్శ నాయకుడని పలువురు నాయకులు అన్నారు. ఆంధ్రప్రదేశ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ కర్ణాటక రాష్ట్రం పావగడలో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు.

ఫ టీడీపీ నాయకులు, అభిమానులు
ఫ పార్టీలకతీతంగా తరలివచ్చిన యువకులు
పావగడ, సెప్టెంబరు 25: రాజకీయాల్లో చంద్ర బాబు ఆదర్శ నాయకుడని పలువురు నాయకులు అన్నారు. ఆంధ్రప్రదేశ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ కర్ణాటక రాష్ట్రం పావగడలో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు అభిమానులు, ఐటీ ఉద్యోగులు పెద్దఎత్తున ఈ ర్యాలీలో పాల్గొన్నారు. స్థానిక ఐబీ (ఇనస్పెక్షన భవన) నుంచి శని మహాత్మ సర్కిల్ మీదుగా అంబేడ్కర్ సర్కిల్ వరకూ ర్యాలీ కొనసాగింది. ‘సైకో పోవాలి.. సైకిల్ రావాలి’ అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీనియర్ వైద్యులు, వివేకానంద విద్యాసంస్థ కార్యదర్శి డాక్టర్ జి.వెంకటరామయ్య ప్రసంగించారు. చంద్రబాబునాయుడు ప్రపంచంలోనే మచ్చలేని నాయకుడని, యువతరానికి ఆదర్శప్రాయుడని అన్నారు. అక్రమ కేసుల నుంచి ఆయన బయటపడి, 2024 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమని అన్నారు.
ఫ మహిళలకు టీడీపీలో అత్యంత ప్రాధాన్యం కల్పించిన నాయకుడు చంద్రబాబునాయుడు అని తెలుగు మహిళ శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షురాలు సుబ్బరత్నమ్మ అన్నారు. ఆంధ్రప్రదేశ రాష్ట్రానికే కాకుండా యావత భారత దేశానికే ఆయన రాజకీయాలు ఆదర్శమని అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. నారా లోకేశ చేపట్టిన యువగళం పాదయాత్రను చూసి సహించలేక చంద్రబాబును జగన అక్రమ కేసుల్లో ఇరికించారని ఆరోపించారు.
ఫ దేశవ్యాప్తంగా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తున్నారని, నిరసనల పర్వం కొనసాగుతోందని టీడీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ ఇనచార్జి ఉమామహేశ్వరనాయుడు అన్నారు. పావగడలో పార్టీలకు అతీతంగా బాబుకోసం మేముసైతం అంటూ ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని అన్నారు. భారతదేశానికి అబ్దుల్‌కలాం లాంటి రాష్ట్రపతిని, ఐకే గుజ్రాల్, దేవెగౌడ వంటి మహనీయులను ప్రధాన మంత్రులను చేసిన ఘనత చంద్రబాబునాయుడుకే దక్కిందని అన్నారు. వేల కోట్ల స్కాం చేసిన జగన, మచ్చలేని చంద్రబాబును అక్రమంగా కేసులో ఇరికించి, అరెస్టు చేయించడం రాజకీయ కుట్ర అని అన్నారు. ర్యాలీలో చంద్రబాబు, నందమూరి అభిమానులు, జనసేన అభిమానులు పాల్గొన్నారు.