తెలుగుతమ్ముళ్ల సంబరాలు
ABN , First Publish Date - 2023-03-19T00:24:50+05:30 IST
పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలుపొందడంపై టీడీపీ నాయకులు శనివారం సంబరాలు చేసుకున్నారు.

(ఆంధ్రజ్యోతి, న్యూస్ నెట్‌వర్క్)
పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలుపొందడంపై టీడీపీ నాయకులు శనివారం సంబరాలు చేసుకున్నారు. పట్టణ ప్రధాన రహదారులలో బాణాసం చా పేల్చుతూ సంబరాలు చేసుకున్నారు. అదేవిధంగా ర్యాలీలు నిర్వహిం చారు. టీడీపీ గెలుపు ఆరంభమని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ టీడీపీ గెలుపు ఖాయమని పేర్కొన్నారు. ఎన్నికలలో అధికార పార్టీ నాయకులు ఎన్ని ప్రలో బాలకు, భయబ్రాంతులకు గురిచేసినా రాష్ట్రాభివృద్ధి కోసం పట్టభద్రులు ఆలోచించి ఓటు వేశారన్నారు. ధర్మవరం పట్టణం, మండలంలోని గొట్లూరు, పుట్టపర్తి కొత్తచెరువు, బుక్కపట్నం, తాడిమర్రి, ముది గుబ్బ, అమడగూరు నల్ల మాడ, నల్లచెరువు, ఓబులదేవర చెరువు మండలకేంద్రాల్లో టీడీపీ నాయకులు ఎంతో ఉత్సాహంతో విజయోత్సవాలు నిర్వహించారు.