‘చలో ఢిల్లీ’ని జయప్రదం చేయండి

ABN , First Publish Date - 2023-03-26T00:28:38+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొడదామని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రకుమార్‌ పిలుపునిచ్చారు.

‘చలో ఢిల్లీ’ని జయప్రదం చేయండి

సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రకుమార్‌

అనంతపురం కల్చరల్‌, మార్చి 25: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొడదామని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రకుమార్‌ పిలుపునిచ్చారు. ఏప్రిల్‌ 5న చేపట్టనున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ శనివారం జిల్లాకేంద్రంలోని తపోవనం సర్కిల్‌ వద్ద జీపు జాతాను నాగేంద్రకుమార్‌ చేతులమీదుగా ప్రారంభించారు. ఈ జీపుజాతా నీలిమా సర్కిల్‌, ఆర్టీసీ బస్టాండు, శ్రీకంఠం సర్కిల్‌, తాడిపత్రి బస్టాండు మీదుగా పాతూరు చేరుకుంది. ఈ సందర్భంగా పాతూరులో నిర్వహించిన బహిరంగ సభలో నాగేంద్రకుమార్‌ మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తూ కార్పొరేట్‌ శక్తులకు అనుకూ లంగా కార్మిక చట్టాల సవరణ చేసి నాలుగు లేబర్‌ కోడ్‌లుగా చేయడాన్ని కార్మికలోక మంతా వ్యతిరేకిస్తోందన్నారు. కార్పొరేట్లకు అనుకూలంగా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ దేశసంపదను దోచిపెట్టేవిధంగా ఉందని విమర్శించారు. వివిధ డిమాండ్ల సాధనకోసం ఏప్రిల్‌ 5న ఢిల్లీలో మహాధర్నా చేపడుతున్నట్లు తెలిపారు. ధర్నాలో లక్షలాదిమంది కార్మి కులు, రైతులు, వ్యవసాయ కూలీలు, నిరుద్యోగ యువత పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. అనంతరం జీపు జాతా కలెక్టరేట్‌ మీదుగా రాప్తాడు చేరుకుంది. సీఐటీయూ నగర కార్యదర్శి వెంకటనారాయణ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో నగరాధ్యక్షుడు బాబు, ఉపాధ్యక్షుడు ప్రకాశరెడ్డి, ఎర్రిస్వామి, లక్ష్మీనరసమ్మ, వరలక్ష్మి, భగ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-26T00:28:38+05:30 IST