కురుమామిడిలో మినీ మేనిఫెస్టోపై ప్రచారం
ABN , First Publish Date - 2023-08-22T00:17:56+05:30 IST
గాండ్లపెంట, ఆగస్టు 21: మండలంలోని కురమామిడి పంచాయతీలో సోమవారం టీడీపీ నాయకులు, కార్యకర్తలు మహిళా కమిషన మాజీ సభ్యురాలు పర్వీన బాను ఆధ్వర్యంలో మహాశక్తి చైతన్యరథయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు.
గాండ్లపెంట, ఆగస్టు 21: మండలంలోని కురమామిడి పంచాయతీలో సోమవారం టీడీపీ నాయకులు, కార్యకర్తలు మహిళా కమిషన మాజీ సభ్యురాలు పర్వీన బాను ఆధ్వర్యంలో మహాశక్తి చైతన్యరథయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరుగుతూ చంద్రబాబు ప్రకటించిన మినీమేనిఫెస్టో పథకాల గురించి ప్రజలకు కరపత్రాలు పంచుతూ తెలియజేశారు. అనంతరం పర్వీన బాను మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి రాగానే ఆర్టీసీ బస్సులలో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. అలాగే ప్రతికుటుంబానికి ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వనున్నారన్నారు. తల్లికి వందనం పేరుతో ఇంటిలో చదువుతున్న పిల్లలకు ఒక్కొక్కరికి రూ.15వేలు, రైతులకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి రూ.20వేలు, 18యేళ్లు నిండిన యువతకు భవిష్యత గ్యారెంటీ కింద నిరుద్యోగభృతి తదితర పథకాలను అమలు చేయనున్నట్లు వివరించారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒకరు టీడీపీకి మద్దతు పలకాలని కోరారు. కార్యక్మంలో పార్టీ మండల మండల కన్వీనర్ కొండయ్య, మాజీ సర్పంచ ప్రసాద్, నాయకులు రవి, గంగరత్నమ్మ, లోకేష్, గంగిరెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.