‘బూత కన్వీనర్లు సైనికుల్లా పనిచేయాలి’
ABN , First Publish Date - 2023-10-30T23:53:24+05:30 IST
రానున్న ఎన్నికల నేపథ్యంలో టీడీపీ బూత కన్వీనర్లు సైనికుల్లా పనిచేయాలని మండల కన్వీనర్ అశ్వత్థనారా యణరెడ్డి పిలుపునిచ్చారు.
హిందూపురం, అక్టోబరు 30 : రానున్న ఎన్నికల నేపథ్యంలో టీడీపీ బూత కన్వీనర్లు సైనికుల్లా పనిచేయాలని మండల కన్వీనర్ అశ్వత్థనారా యణరెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని సోమవారం వద్ద మండలంలోని యూనిట్ ఇనచార్జ్‌లు, బూత కన్వీనర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అశ్వత్థనారాయణరెడ్డి మాట్లాడుతూ... ఎన్నికలకు మరో ఐదు నెలలు ఉంది కాబట్టి ఇప్పటి నుంచే ప్రతి బూత కన్వీనర్ సైనికుల్లా పనిచేస్తే విజయం తథ్యమన్నారు. ముఖ్యంగా బాబు షూరిటీ... భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంతో పాటు మినీ మ్యానిఫెస్టోలో ప్రకటించిన పథకాలు ప్రజలకు వివరించాలన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ విషయాన్ని ఇంటిం టికీ తీసుకెళ్లాలన్నారు. వైసీపీ చేస్తున్న ఆగడాలు, అఘాయిత్యాలు, దౌర్జన్యా లను ప్రతి ఓటరుకు తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో మండలంలోని నాయకులు కార్యకర్తలతోపాటు బూత కన్వీనర్లు పాల్గొన్నారు.