‘బాబు వెంటే మైనార్టీలు’

ABN , First Publish Date - 2023-09-26T00:00:01+05:30 IST

రాష్ట్రంలో జరుగుతున్న పరిణా మాలతో పాటు చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ కారణంగా... తామంతా ఆయన వెంటే ఉంటామని మైనార్టీ నాయకులు పేర్కొన్నారు.

‘బాబు వెంటే మైనార్టీలు’

హిందూపురం, సెప్టెంబరు 25: రాష్ట్రంలో జరుగుతున్న పరిణా మాలతో పాటు చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ కారణంగా... తామంతా ఆయన వెంటే ఉంటామని మైనార్టీ నాయకులు పేర్కొన్నారు. చంద్రబా బు అక్రమ అరెస్టుకు నిరసనగా టీడీపీ మైనార్టీ నాయకులు సోమవారం పట్టణంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ.. టీడీపీ అధినేత నారాచంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్ట్‌చేసి ఇబ్బందులు పెడుతున్నారని, చంద్రబాబుకు ఈ వయసులో పెద్ద శిక్ష వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీకి రోజులు దగ్గర పడ్డాయన్నారు. వైసీపీ నాయకులు ప్రతిరోజూ టీడీపీపై చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారేగానీ నిరూపించడంలో విఫలమయ్యారని అన్నారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తే ఈ సైకో ప్రభుత్వం నాశనం చేస్తోం దని మండిపడ్డారు. ముస్లిం మైనార్టీలకు చంద్రబాబు తీసుకొచ్చిన పథ కాలు మరువలేనివన్నారు. ఈ ప్రభుత్వంలో మైనార్టీల పేర్లు చెబుతు న్నారేతప్ప తకు చేసిందేమిటని ప్రశ్నించారు. చంద్రబాబు వెంటనే మేముంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మైనార్టీసెల్‌ నాయకులు షఫీ, ప్యారుసాబ్‌, హిదాయత, ఇందాద్‌, డైమండ్‌బాబా, నజీర్‌తోపటు నియోజకవర్గంలోని టీడీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-26T00:00:01+05:30 IST