రాక్షస పాలన పోవాలంటే బాబు రావాలి

ABN , First Publish Date - 2023-03-28T00:24:02+05:30 IST

రాష్ట్రంలో రాక్షస పాలన పోవాలంటే చంద్రబాబు రావాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి అన్నారు. గోరంట్లలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

రాక్షస పాలన పోవాలంటే బాబు రావాలి
బహిరంగసభలో లోకేశతో బీకే, సవిత, నిమ్మల

బహిరంగ సభలో టీడీపీ నాయకులు

హిందూపురం, మార్చి 27: రాష్ట్రంలో రాక్షస పాలన పోవాలంటే చంద్రబాబు రావాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి అన్నారు. గోరంట్లలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు వెళ్లిందని, కానీ ఈ నాలుగేళ్లలో 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాబు అభివృద్ధి చేసి చూపించాడని, జగన యువకుడు అని ఓట్లు వేస్తే కక్ష సాధిస్తున్నాడని ఆరోపించారు. హంద్రీనీవా నీటితో చెరువుల నింపాలని లోకేశని కోరారు. స్థానిక ఎమ్మెల్యే వల్ల పరిశ్రమలు వెళ్లిపోయాయని అన్నారు. సొంత పార్టీ రెడ్లమీదే ఎమ్మెల్యే కేసులు పెట్టించాడని, ఆయనను శంకరగిరి మాన్యాలకు పంపేరోజులు దగ్గరపడ్డాయని అన్నారు. ఆయన సోదరులు నియోజకవర్గాన్ని దోచుకొని దాచుకుంటున్నారని విమర్శించారు.

నిజాయితీకి మారుపేరు టీడీపీ: సవిత

నీతి నిజాయితీకి మారు పేరు తెలుగుదేశం పార్టీ అని పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత అన్నారు. పాదయాత్ర చేస్తున్న లోకేశకి జనం నీరాజనం పలుకుతున్నారని అన్నారు. త్వరలోనే ఎన్నికలు వస్తాయని, చంద్రబాబుని సీఎం చేయడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు హంద్రీనీవా ద్వారా గొల్లపల్లి రిజర్వాయర్‌, చెరువులను నీటితో నింపారని అన్నారు.

టీడీపీ పథకాలకు వైసీపీ ఓపెనింగ్‌: నిమ్మల

తెలుగుదేశం హయాంలో మంజూరైన పథకాలను వైసీపీ అధికారంలోకి వచ్చాక ఓపెనింగ్‌ చేస్తున్నారని మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప విమర్శించారు. ఈ నాలుగేళ్లలో ఒక్క రూపాయి కూడా అభివృద్ధి జరగలేదని అన్నారు. సొంత నాయకులపైనే ఎమ్మెల్యే కేసులు పెట్టించి, స్టేషన చుట్టూ తిప్పుతున్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే సోదరులకు ఎవరైనా కప్పం కట్టకపోతే వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తారని అన్నారు. ఎమ్మెల్యే ఏం చేస్తున్న సీఎం పట్టించుకోవడం లేదని అన్నారు. వివేకా హత్య కేసు నుంచి అవినా్‌షని కాపాడుకునేందుకు జగన తాపత్రయ పడుతున్నారని, అందుకోసమే తరచూ ఢిల్లీకి వెళుతున్నారని ఆరోపించారు.

Updated Date - 2023-03-28T00:24:02+05:30 IST