Share News

అట్టహాసంగా మగువ షాపింగ్‌ మాల్‌ ప్రారంభం

ABN , Publish Date - Dec 17 , 2023 | 11:55 PM

అనంత నగరంలో మగువ షాపింగ్‌ మాల్‌ ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యింది. ఈ ప్రారంభోత్సవానికి యాంకర్‌, సినీనటి యాంకర్‌ అనసూయ రావడంతో అభిమానులు సందడి చేశారు.

అట్టహాసంగా మగువ షాపింగ్‌ మాల్‌ ప్రారంభం
జ్యోతిప్రజ్వలన చేస్తున్న అనసూయ

జ్యోతి వెలిగించి ప్రారంభించిన యాంకర్‌, సినీనటి అనసూయఅనంతపురం ప్రెస్‌క్లబ్‌, డిసెంబరు17 : అనంత నగరంలో మగువ షాపింగ్‌ మాల్‌ ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యింది. ఈ ప్రారంభోత్సవానికి యాంకర్‌, సినీనటి యాంకర్‌ అనసూయ రావడంతో అభిమానులు సందడి చేశారు. నగరంలోని కమలానగర్‌లో మగువషోరూం యజమాని గోకుల్‌, రవికుమార్‌, చైతన్య, అనిల్‌లు మగువా షాపింగ్‌ మాల్‌ను ఏర్పాటు చేశారు. ఈ మాల్‌ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా అనసూయ హాజరయ్యారు. అనసూయ అనంతకు వస్తోందన్న విషయం తెలుసుకున్న ప్రజలు, అభిమానులు మాల్‌ వద్దకు అధిక సంఖ్యలో చేరుకున్నారు. దీంతో మాల్‌ ప్రాంగణమంతా సందడి వాతావరణం నెలకొంది. మాల్‌లో నాలుగు అంతస్థుల్లో పెద్దలు, చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన వస్ర్తాలు, కిడ్స్‌ వేర్‌ను ఆమె పరిశీలించి వాటి గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ... అనంతపురం రావడంతో ఎంతో సంతోషంగా ఉందని, ఇక్కడ అభిమానులు చూపిన ప్రేమాభిమానాలు ఎప్పటికీ మరిచిపోలేనన్నారు. మగువ షాపింగ్‌ మాల్‌లో రూ.49లకే చీరలు అందిస్తున్నారన్నారు. ఇదే సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను ఆరు సినిమాల్లో నటిస్తున్నానని, పుష్ప-2తోపాటు మరో రెండు సినిమాలకు సైన చేసినట్లు ఆమె చెప్పుకొచ్చారు.

Updated Date - Dec 17 , 2023 | 11:55 PM