కల్లు దుకాణాలపై దాడులు

ABN , First Publish Date - 2023-03-25T00:07:45+05:30 IST

మండలంలో అనధికార కల్లు దుకాణాలపై శుక్రవారం ఎక్సైజ్‌ శాఖ అధికారులు దాడులు చేశారు. ఎక్సైజ్‌ ఎస్‌ఐ అన్నపూర్ణ, సిబ్బందితో కలసి పలు దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు.

కల్లు దుకాణాలపై దాడులు

అనధికారిక విక్రయాలు

పలువురికి నోటీసులు

పరిగి, మార్చి 24: మండలంలో అనధికార కల్లు దుకాణాలపై శుక్రవారం ఎక్సైజ్‌ శాఖ అధికారులు దాడులు చేశారు. ఎక్సైజ్‌ ఎస్‌ఐ అన్నపూర్ణ, సిబ్బందితో కలసి పలు దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. టీఎ్‌ఫటీ రికార్డులు పరిశీలించారు. పలుచోట్ల నిజమైన కల్లుగీత కార్మికులు లేరని నిర్ధారించారు. అనధికార వ్యక్తులు కల్లు అ మ్ముతున్నట్లు గుర్తించారు. కొడిగెనహళ్లిలోని ఓ దుకాణంలో అక్కడే కల్లు తయారు చేస్తున్నట్లు గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. ఈమేర కు దుకాణంలోని కల్లును పరిశీలించి, శ్యాంపిల్‌ సేకరించి లేబొరేట రీకి పంపారు. ఈ విషయమై ఎక్సైజ్‌ ఎస్‌ఐ అన్నపూర్ణను వివరణ కోరగా, అనుమతులు లేకుండా కల్లు దుకాణాలు నిర్వహిస్తున్నట్లు నిర్ధారించామని తెలిపారు. ఈ దుకాణాల తనిఖీలు నిర్వహించేందు కు వెళ్లగా, అనుమతులు పొందిన అసలైన కల్లు విక్రయాలు చేసేవారు లేరని, వారికి నోటీసులు జారీచేశామని పేర్కొన్నారు.

రెన్యువల్‌ లేకుండానే నిర్వహణ

మండలవ్యాప్తంగా గతంలో సుమారు 28 కల్లు దుకాణాలకు అ నుమతులు పొందారు. గత ఏడాది డిసెంబరు నాటికి ఈ దుకాణాల గడువు ముగిసింది. అయితే సంబంధిత దుకాణాల నిర్వాహకులు రెన్యువల్‌ చేసుకోవాల్సి ఉంది. ఇప్పటివరకు ఐదుగురు మాత్రమే రెన్యువల్‌ చేసుకున్నారు. మిగతావి సుమారు మండలవ్యాప్తంగా 52 చోట్ల అనధికారికంగా కల్లు విక్రయాలు సాగుతున్నాయి. కల్తీ కల్లు ప్రజలకు హానికరమని ఎంత మొత్తుకున్నా అధికార యంత్రాంగం మొద్దునిద్ర వీడటంలేదు. ఉన్నతాధికారులతో మెప్పు పొందడానికి తూతూమంత్రంగా తనిఖీలు నిర్వహించి మమ అనిపిస్తున్నారన్న విమర్శలున్నాయి. వాస్తవాలు తెలిసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నారు.. దీంతో కల్లు మాఫియా మరిం త రెచ్చిపోయి, తమ వ్యాపారాలు యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. కట్టడి చేయాల్సిన ఎక్సైజ్‌, ఎన్ఫోర్స్‌మెంట్‌ అధికారులు నిర్లక్ష్యపు నీ డలో జోగుతున్నారు. మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో రెన్యువల్‌ కాని కల్లు దుకాణాలు నడుస్తున్నాయన్న సమాచారం తెలిసీ, అధికా ర పార్టీ నాయకుల ఒత్తిళ్లతో కల్తీకల్లు వ్యాపారం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి, అనధికార కల్లు దుకా ణాలను తొలగించి, కల్తీకల్లు విక్రయాలు లేకుండా చూడాలని మం డల ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2023-03-25T00:07:45+05:30 IST