ఓటమి భయంతోనే వైసీపీ రౌడీల దాడులు

ABN , First Publish Date - 2023-02-21T23:35:25+05:30 IST

రానున్న ఎన్నికల్లో ఓటమి చెందుతామోనని భయంతో టీడీపీ కార్యాలయం, టీడీపీ నాయకులపై వైసీపీ రౌడీమూకలు దాడులు చేశాయని టీడీపీ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ఓటమి భయంతోనే వైసీపీ రౌడీల దాడులు

రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉందా? : టీడీపీ నాయకులు

ధర్మవరం, ఫిబ్రవరి 21: రానున్న ఎన్నికల్లో ఓటమి చెందుతామోనని భయంతో టీడీపీ కార్యాలయం, టీడీపీ నాయకులపై వైసీపీ రౌడీమూకలు దాడులు చేశాయని టీడీపీ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గన్నవరం టీడీపీ కార్యాలయం, నాయకులపై చేసిన దాడిని వారు మం గళవారం టీడీపీ స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. రాష్ట్రంలో అటవికపాలన సాగుతోందన్నారు. వైసీపీ నాయకులు అధికార మదంతో దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడం దారు ణమన్నారు. దీన్ని చూస్తుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికే ఉందా... అసలు పోలీసు వ్యవస్థ ఉందా... అన్న అనుమానం కలుగు తోందన్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై, టీడీపీ నాయకులపై దాడు లు చేసి తిరిగి వారిపైనే కేసులు బనాయించడం వైసీపీ పనికిమాలిన చర్యగా భావి స్తున్నామన్నారు. దాడులకు సూత్రదారి అయిన గన్నవరం ఎమ్మెల్యే వంశీ ని తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్య క్రమంలో టీడీపీనాయకులు కమతం కాటమయ్య, పురుషోత్తంగౌడ్‌, సాహె బ్బీ, చింతపులుపు పెద్దన్న, అంబటిసనత, నాగూర్‌హుస్సేన, రాళ్లపల్లి షరీఫ్‌, క్రిష్ణాపురం జమీర్‌అహమ్మద్‌, పల్లపు శివశంకర్‌, కాశప్ప, ఇర్షాద్‌; ఉస్మాన, బీరే శీన, చిట్రా రామ్మోహన, పల్లపురవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

గన్నవరం ఘటనకు కారకులను అరెస్టు చేయాలి

విజయవాడలోని గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడికి పాల్పడిన వైసీపీ గూండాలను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఎస్‌ఐ మహమ్మద్‌ రఫీకి తెలుగుయువత, టీఎనఎస్‌ఎఫ్‌, ఐటీడీపీ నాయకులు డిమాండ్‌చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ....రాష్ట్రంలో వైసీపీ గుండాల అరాచకాలు మితిమీరిపోయాయన్నారు. వీటిని ప్రజలు గమనిస్తు న్నారన్నారు. ఇకనైనా వైసీపీ గూండాలు దౌర్జన్యాలు మానుకోకపోతే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని వారు హెచ్చరించారు.

Updated Date - 2023-02-21T23:35:29+05:30 IST