Share News

అజెండా ఆమోదమా... తిరస్కారమా..?

ABN , Publish Date - Dec 31 , 2023 | 12:38 AM

స్థానిక మునిసిపల్‌ కౌన్సిల్‌ సమావేశా న్ని చైర్‌పర్సన ఇంద్రజ అధ్యక్షతన శనివారం జరిగింది. అయితే కమిషనర్‌ సమావేశానికి రాకపోవడంతో సభ్యులు మినిట్‌బుక్‌లో సంత కాలు పెట్టి వెళ్లిపోయారు.

అజెండా ఆమోదమా... తిరస్కారమా..?
వైసీపీ సభ్యులు వెళ్లిపోయినా టీడీపీ సభ్యులు ఉన్న దృశ్యం

కమిషనర్‌ రాలేదంటూ వైసీపీ సభ్యులు బాయ్‌కాట్‌

సంతకాలు పెట్టి వెళ్లిపోయిన కౌన్సిలర్లు

మంత్రి వీడియో కాన్ఫరెన్సలో పాల్గొన్న కమిషనర్‌

కావాలనే వెళ్లిపోయినట్లు ఓ వర్గం ఆరోపణ

హిందూపురం, డిసెంబరు 30 : స్థానిక మునిసిపల్‌ కౌన్సిల్‌ సమావేశా న్ని చైర్‌పర్సన ఇంద్రజ అధ్యక్షతన శనివారం జరిగింది. అయితే కమిషనర్‌ సమావేశానికి రాకపోవడంతో సభ్యులు మినిట్‌బుక్‌లో సంత కాలు పెట్టి వెళ్లిపోయారు. అయితే అజెండా ఆమోదం పొందిందా లేక తిర స్కారం అయిందా అనేది సభ్యులకే తెలియని ప్రశ్నంగా మారిపోయింది. పట్టణంలోని మునిసి పల్‌ కార్యాలయంలో శనివారం ఉదయం 11గం టలకు మునిసిపల్‌ కౌన్సిల్‌ సర్వసభ్య సమావేశం ప్రారంభంకాగా 11.30 వరకు కమిషనర్‌ ప్రమోద్‌ కుమార్‌ హాజరుకాలేదు. దీంతో అధికార పార్టీకి చెందిన కొంతమంది సభ్యులు మాట్లాడుతూ... సభ్యులు ఐదు నిమిషాలు ఆలస్యంగా వస్తే కోరం లేదని వాయిదా వేసిన సంఘటనలు ఉన్నాయ న్నారు. ఈ రోజు సమావేశం ప్రారంభమై అరగంటైనా కమిషనర్‌ రాలేదు. ... దీంతో సమావేశాన్ని ఎందుకు వాయిదా వేయకూడదని ప్రశ్నించారు. అంతేకాక ఈరోజు సమావేశం జరగడానికి వీలులేదని, కమిషనర్‌ రాక పోవడంతోనే సమావేశాన్ని బాయ్‌కాట్‌ చేస్తున్నామని వారు బయటకు వెళ్లిపోయారు. ఆ తరువాత కమిషనర్‌ వచ్చారు. అప్పటికే చైర్‌పర్సన ఇంద్రజ, వైస్‌ చైర్మన బలరాంరెడ్డి చైర్‌పర్సన చాంబర్‌లోకి వెళ్లారు. టీడీపీ సభ్యులు మాత్రమే సమా వేశంలో కూర్చున్నారు. మిగిలిన సభ్యులు లేకపో వడంతో కమిషనర్‌ కూడా చైర్‌పర్సన చాంబర్‌లోకి వెళ్లారు. తాను ఇప్పటి వర కు మునిసిపల్‌ శాఖ మం త్రి సంబంధిత కమిషనర్‌ తో పాటు రాష్ట్ర అధికా రులు పారిశుధ్యంపై వీడి యో కాన్ఫిరెన్స నిర్వహిం చారని, అందులో తప్పని సరిగా పాల్గొనాలని తెలి పారు. దీంతో వీసీలో పాల్గొన్నానన్నారు. అంతమాత్రానికే సభ్యులు వెళ్లి పోవడం బాధాకరమన్నారు.

కావాలనే వెళ్లిపోయారా..?

ఇదిలా ఉండగా శనివారం అజెండాలో పొందుపరిచిన అంశాలపై ఆమోదం తెలుపడానికి కొంత మంది కౌన్సిలర్లకు ఇష్టం లేదు. వీటితో పాటు అధికార పార్టీ కీలకనేత వద్ద ఉన్న ఒకరిద్దరు కౌన్సిలర్లకు చెందిన అభివృద్ధి పనులకు సంబంధించి టెండర్లు పిలిచారు. కానీ మరికొన్ని వా ర్డులకు సంబంధించి టెండర్లు ఎందుకు పిలవలేదని, వారేనా కౌన్సిలర్లు మేము కాదా అని చర్చించుకున్నట్లు తెలిసింది. కమిషనర్‌ ఒకరిద్దరికే ఎలా తలూపుతారని అందుకోసం డీసెంట్‌ ఇవ్వడానికీ సిద్ధపడినట్లు సమాచా రం. ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన కమిషనర్‌ సమావేశానికి రాలేదంటూ కొందరు కౌన్సిలర్లు బహిరంగంగా ఆరోపించారు. చైర్‌పర్సన, కమిషనర్‌ మినిట్‌ బుక్కులో సంతకాలు పెట్టారేతప్ప ఆమోదానికి సంతకాలు పెట్టకపోవడంతో అజెండా ఆమోదం కాలేదని తెలిసింది.

Updated Date - Dec 31 , 2023 | 12:38 AM