ప్రజాసమస్యలపై చర్చ ఏదీ..?

ABN , First Publish Date - 2023-06-01T00:06:45+05:30 IST

మూడు నెలలుగా కౌన్సిల్‌ సమావేశంలో ప్రజా సమస్యలే చర్చించలేదని, చర్చించిన కొన్నింటి పరిష్కారం దిశగా అధి కారులు చొరవ చూపలేదని పలువురు కౌన్సిలర్లు చైర్‌పర్సన భాగ్యలక్ష్మి దృష్టికి తెచ్చారు.

ప్రజాసమస్యలపై చర్చ ఏదీ..?

కౌన్సిల్‌ సమావేశంలో నిలదీసిన సభ్యులు

ధర్మవరం, మే 31: మూడు నెలలుగా కౌన్సిల్‌ సమావేశంలో ప్రజా సమస్యలే చర్చించలేదని, చర్చించిన కొన్నింటి పరిష్కారం దిశగా అధి కారులు చొరవ చూపలేదని పలువురు కౌన్సిలర్లు చైర్‌పర్సన భాగ్యలక్ష్మి దృష్టికి తెచ్చారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో బుధవారం తాత్కా లిక చైర్‌పర్సన భాగ్యలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్‌ సమావేశాన్ని నిర్వహిం చా రు. ముందుగా ప్రపంచశాంతికి రెండు నిమిషాలు మౌనం పాటించారు. అజెండాలోని అంశాలను తీర్మానించారు. అనంతరం 7వ వార్డులోని కేశ వనగర్‌లో ఇటీవల కుక్కలబెడద అధికంగా ఉందిని, బుధవారం కూడా ఓ బాలికపై మూడుకుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయని ఆ వార్డు కౌన్సిలర్‌ గడ్డం వరలక్ష్మీ చైర్‌పర్సన దృష్టికి తీసుకొచ్చారు. 25వ వార్డు ప్రియాంకనగర్‌లో సీసీరోడ్డువేశారని, అయితే చివరి బాగాన డౌన చేయడం వల్ల నీరంతా ఇళ్లలోకి పోతోందని ఆ వార్డు కౌన్సిలర్‌ మేడాపు రం వెంకటేశ చైర్‌పర్సన దృష్టికితెచ్చారు. పట్టణంలో వేసవిని ఆసరాగా తీసుకుని నీటి విక్రయదారులు అధిక ధరలకు నీటిని విక్రయిస్తున్నారని కౌన్సిలర్‌ పురుషోత్తంరెడ్డి చైర్‌పర్సన దృష్టికి తెచ్చారు. సూర్యస్కూల్‌ వద్ద రోడ్డు వేశారు కానీ, అక్కడ ఉన్న గుంతను పూడ్చకుండా అలాగే వదిలే శారని ఆయన సభ దృష్టికి తెచ్చారు. ప్రతి సోమవారం సచి వాలయా ల్లో సిబ్బంది కనీసం రెండు గంటలైన అందుబాటులో ఉండేలా చూడాలని కౌన్సిలర్‌ గజ్జలశివ చైర్‌పర్సన దృష్టికి తెచ్చారు. అలాగే మిగిలిన కౌన్సిలర్‌లు ఆయా వార్డులలోని సమస్యలపై గళం విప్పారు.

Updated Date - 2023-06-01T00:06:45+05:30 IST