Share News

అంగనవాడీల రిలే నిరాహార దీక్షలు

ABN , Publish Date - Dec 24 , 2023 | 12:16 AM

తమ సమస్యల పరిష్కారం కోసం అంగనవాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన సమ్మె శనివారం 12వ రోజుకు చేరింది. వారు రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు.

అంగనవాడీల రిలే నిరాహార దీక్షలు
పెనుకొండ సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట అంగనవాడీల నిరసన

(ఆంధ్రజ్యోతి, న్యూస్‌నెట్‌వర్క్‌)

తమ సమస్యల పరిష్కారం కోసం అంగనవాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన సమ్మె శనివారం 12వ రోజుకు చేరింది. వారు రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రస్తుత సీఎం జగన్మోహనరెడ్డి గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవ డంలో విఫలమయ్యారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి తమ సమ స్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం ఆపేది లేదన్నారు. మడకశిర పట్టణంలోని ఐసీడీఎస్‌ కా ర్యాలయం ఆవరణంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వరస్వామి ఫొటో ఉంచి జగనకు మంచి బుద్ధిని ప్రసాదించాలని వారు కోరారు.

Updated Date - Dec 24 , 2023 | 12:16 AM