కొనసాగిన అంగనవాడీల సమ్మె
ABN , Publish Date - Dec 18 , 2023 | 12:03 AM
అంగనవాడీల సమ్మె ఆరో రోజు ఆదివారం కొనసాగింది. ఈ సందర్భంగా స్థానిక ఇందిరా పార్కు నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు.
వినూత్న రీతిలో నిరసనలు
హిందూపురం అర్బన, డిసెంబరు 17: అంగనవాడీల సమ్మె ఆరో రోజు ఆదివారం కొనసాగింది. ఈ సందర్భంగా స్థానిక ఇందిరా పార్కు నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఆదివారం కావడంతో అంగనవాడీలు వారి పిల్లలను నిరసనకు తీసుకొచ్చారు. చిన్నారులు మా ట్లాడుతూ ‘జగన మావమ్యా.. మా అమ్మలకు వేతనం పెంచి... మమ్మల్ని బాగా చదించే స్థోమత వారికి కల్పించు’ అంటూ నిరసన తెలిపారు. అలాగే ఓటు వేసి గెలిపించినందుకు తమకు గడ్డి తినే పరిస్థితి వచ్చిందంటూ అంగనవాడీలు గడ్డి తిని నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్ కార్యాల యం ఎదుట కూర్చుని సోది చెప్పారు. కార్యక్రమంలో ఏపీ అంగనవాడీ వర్కర్ల యూనియన జిల్లా ఉపాధ్యక్షురాలు ఉషారాణి, ప్రాజెక్టు కార్యదర్శి లావణ్య, సెక్టారు నాయకులు శిరీష, శైలజ, నాగమ్మ, రిహానా, సుమయ, వరలక్ష్మి, వందలాది మంది అంగనవాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.
పెనుకొండ రూరల్ : వైసీపీ ప్రభుత్వం అంగనవాడీల సమస్యలు పరిష్కరించేవరకు పోరాడుతూనే ఉంటామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రమేష్ పేర్కొన్నారు. పెనుకొండ నగర పంచాయతీ పరిధిలోని తిమ్మాపు రంలో ఆదివారం నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న అంగన వాడీ కార్యకర్తలు, ఆయాలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో అంగనవాడీ వర్కర్లు కృష్ణవేణి, టీడీపీ కౌన్సిలర్ గిరి, రియాజ్ తదితరులు పాల్గొన్నారు.
మడకశిరటౌన: అంగనవాడీల సమస్యలు పరిష్కరించేంత వరకు తమ పోరాటం ఆపమని అంగనవాడీల ప్రాజెక్ట్ అధ్యక్షురాలు ఉషారాణి, నాయకు లు శ్రీదేవి, పద్మావతి తదితరులు అన్నారు. ఆదివారం అంగనవాడీలు స్థానిక ఐసీడీఎస్ కార్యాలయం వద్ద ఎర్ర చీరలు ధరించి ఆందోళన నిర్వహించారు.
గుడిబండ: అంగనవాడీల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చా లంటూ అంగనవాడీ కార్యకర్తలు, ఆయాలు గుడిబండ సీడీపీఓ కార్యాలయం ఎదుట ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. అంగనవాడీ చిన్నారులు, తల్లిదం డ్రులు నిరసనలో పాల్గొని మద్దతు తెలిపారు. కార్యక్రమంలో అంగనవాడీల యూనియన నాయకురాలు మహదేవమ్మ, సభ్యులు లక్ష్మీదేవి, దేవీరమ్మ, సుజాత, ఈరమ్మ, నాగవేణి, నాగమణి, పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు. చిలమత్తూరు: స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆంగనవాడీలు ఆదివారం చేస్తున్న నిరసనకు అంగనవాడీ కేంద్రాలకు వెళ్లే పిల్లలు, వారి తల్లులు మద్దతు తెలిపారు. అంగనవాడీ కేంద్రాలకు సచివాలయ ఉద్యోగులను పంపితే తమ పిల్లలను పంపమని తల్లులు తెలిపారు.