ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడిస్తాం..!
ABN , Publish Date - Dec 26 , 2023 | 11:07 PM
తమ సమస్యలను పరిష్కరించకుంటే అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల ఇళ్లను ముట్టడిస్తామని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన నేతలు హెచ్చరించారు. కలెక్టరేట్ వద్ద ఆ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం 15వ రోజు నిరసన తెలిపారు. గరిటెలతో ప్లేట్లను కొడుతూ రోడ్డుపై ఆందోళనకు దిగారు.
ప్రభుత్వానికి అంగనవాడీల హెచ్చరిక
15వ రోజు కొనసాగిన సమ్మె
అనంతపురం విద్య, డిసెంబరు 26: తమ సమస్యలను పరిష్కరించకుంటే అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల ఇళ్లను ముట్టడిస్తామని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన నేతలు హెచ్చరించారు. కలెక్టరేట్ వద్ద ఆ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం 15వ రోజు నిరసన తెలిపారు. గరిటెలతో ప్లేట్లను కొడుతూ రోడ్డుపై ఆందోళనకు దిగారు. జగనకు వినిపించేలా శబ్దం చేద్దామని నినదించారు. ఈ సందర్భంగా యూనియన నేతలు మాట్లాడుతూ, వేతనం రూ.26 వేలకు పెంచాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని, మినీ వర్కర్లను మెయిన వర్కర్లుగా గుర్తించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని 15 రోజుల నుంచి ఆందోళన చేస్తుమని అన్నారు. ముఖ్యమంత్రికి అంగనవాడీ అక్కలు, చెల్లెమ్మలు, ఆడపడుచులు కనపడలేదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా చర్చలకు పిలిచి తమ సమస్యలను పరిష్కరించాలని, లేకపోతే ఎమ్మెల్యేలు, ఇతర ప్రతినిధుల ఇళ్లను మ్టుటడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నిరసనకు సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు, జిల్లా ప్రధానకార్యదర్శి నాగేంద్రకుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు రామాంజి, సీపీఐం నాయకుడు ఆర్‌వీ నాయుడు, నగర కార్యదర్శి వెంకటనారాయణ, ఏపీటీఎఫ్ నాయకులు రఘురామిరెడ్డి, సిరాజుద్దీన, యూటీఎప్ నాయకులు కోటేశ్వర జిలాన, కిష్టప్ప మద్దతు తెలిపారు. అంగనవాడీ వర్కర్స్ యూనియన జిల్లా కోశాధికారి జమున, అర్బన అధ్యక్షులు జయభారతి, రూరల్ అధ్యక్షులు అరుణమ్మ, కోశాధికారి హరిప్రియ తదితరులు పాల్గొన్నారు.